సాధారణంగా మనం తినే ఆహార పదార్థాల్లో పప్పు దాన్యాల్లో చాలా పోషక పదార్థాలు దాగి ఉన్నాయి. మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు ఉన్న పప్పులు శాఖాహారులకు చాలా బాగా సహాయపడతాయి. ఈ పప్పు ధాన్యాల వాడకం వేల సంవత్సరాల నుంచి మొదలైంది. భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు రకరకాలుగా వంటల్లో ఉపయోగిస్తారు. వీటిల్లో పీచు, ప్రోటీన్స్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన కలిగి తొందరగా ఆకలి వేయదు. చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు పప్పుని రక రకాలుగా వాడుతుంటారు. అటువంటి పప్పులతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.


పప్పులలో కరిగే ఫైబర్ అధిక స్థాయిలో ఉండుట వలన రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటానికి సహాయపడుతుంది.  కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం మరియు ధమనులను శుభ్రంగా ఉంచడం ద్వారా గుండె వ్యాధులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


అనేక అధ్యయనాలలో అధిక ఫైబర్ ఉన్న పప్పుల వంటి ఆహారాలను తీసుకుంటే గుండె వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిసింది. పప్పులలో ఫోలేట్ మరియు మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫోలేట్ హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించి ప్రమాదకరమైన గుండె వ్యాధిని తగ్గిస్తుంది. మెగ్నీషియం రక్త ప్రవాహం, ఆక్సిజన్ మరియు పోషకాలు శరీరం అంతటా విస్తరించేలా సహాయపడుతుంది. 


పప్పులలో కరగని పీచు పదార్థం ఉండుట వలన మలబద్ధకం మరియు చికాకు పరిచే ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణ లోపాలను నిరోధించడానికి సహాయపడుతుంది.


ఫైబర్ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కరిగే ఫైబర్  పిండిపదార్ధాలను తగ్గించి, జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా ప్రోత్సహించి తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. మధుమేహం, ఇన్సులిన్ నిరోధకశక్తి లేదా హైపోగ్లేసిమియా ఉన్నవారిలో మాత్రమే సహాయపడుతుంది.


  పప్పు ధాన్యాలు,గింజలు, పప్పులు ఈ మూడింటిలోను ప్రోటీన్ అత్యదిక స్థాయిలో ఉంటుంది. పప్పులలో 26 శాతం ప్రోటీన్ ఉంటుంది. ఇది శాఖాహారుల కోసం చాలా అద్భుతముగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: