కళ్ల కింద క్యారీ బ్యాగ్ లు వయసుని, అందాన్ని దెబ్బతీసేలా కనిపిస్తూ ఉంటాయి. కళ్ల కింద ఏర్పడే ఈ నల్లటి వలయాలు పోగొట్టుకోవడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ ఫలితం మాత్రం దొరకలేదు అని చాలా మంది ఢీలాపడుతుంటారు.హోం రెమిడీస్ వల్ల సులభంగా, త్వరగా కళ్ల కింద నల్లటి వలయాలు తొలగించుకోవచ్చు.

బంగాళదుంప:

  • బంగాళదుంప తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇది రుచినే కాదు.. మీ కళ్ల కింద ఉండే డార్క్ నెస్ ని కూడా ఈజీగా తొలగిస్తుంది. కొన్ని నిమిషాలు బంగాళదుంపను ఫ్రిజ్ లో ఉంచాలి. తర్వాత రెండు ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత కళ్లు మూసుకుని.. కళ్ల కింద ఈ బంగాళదుంప ముక్కతో మసాజ్ చేయాలి. కాసేపటి తర్వాత ఒక్కో కంటిపై ఒక్కో బంగాళదుంపను పెట్టుకోవాలి. అలాగే 20 నిమిషాలు పెట్టుకోవాలి.

గుడ్డు:

  • గుడ్డులోని తెల్లసొన కొంచెం గుడ్డులోని తెల్లసొన తీసుకోవాలి. దాన్ని కళ్ల కింద నల్లగా ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. అది ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంటనే ఫలితం ఉంటుంది.

పాలు:

  • పాలు ఫ్రిజ్ లో పెట్టి తీసిన పాలు కొన్ని తీసుకోవాలి. అందులో దూది ముంచి తీసి.. దాన్ని కళ్లపై పెట్టుకోవాలి. అలా 20 నుంచి 30 నిమిషాలు పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి.

రోజ్ వాటర్:

  • రోజ్ వాటర్ లో దూదిని ముంచి అప్పుడప్పుడు కళ్లకింద తుడుస్తూ ఉంటే నల్లమచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.

ఎర్రకందిపప్పు:

  • ఎర్రకందిపప్పును పొడిగా చేసి అందులో చిటికెడు పసుపు, టమోటా, నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారు చేసుకుని కళ్లకింద అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే.. కళ్లకింద నలుపుదనం తగ్గిపోతుంది.

బాదం ఆయిల్:

  • బాదం ఆయిల్ ని రోజూ రాత్రి పడుకునే ముందు కళ్ల కింద రాసుకుని మర్దనా చేసుకుంటే క్రమంగా నల్లటి వలయాలు తగ్గుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: