గుండెజబ్బుతో బాధపడుతున్న వారికి మూలకణాలతో సమర్థమైన చికిత్స అందించడం సాధ్యం అవుతుందని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. కేవలం సమర్థమైనదే కాకుండా సత్వర చికిత్స కూడా వీలవుతుందని తేలుస్తున్నారు. అమెరికాలోని మాయోక్లినిక్‌ రీజెనరేటివ్‌ మెడిసిన్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. గుండెజబ్బుతో బాధపడుతున్న రోగి పిరుదుల నుంచి మూలకణాలను సేకరించి.. వాటిని గుండెలోకి ఇంజెక్షన్‌ ద్వారా ఎక్కించారు. దీంతో గుండె కండరాలు గట్టిపడి.. పని తీరు మెరుగైంది. కేవలం ఆరునెలల్లోనే ఇది సాధ్యం కావడం విశేషం.


ఈ పద్ధతిలో చికిత్స పొందిన వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని కూడా వైద్యులు ప్రకటించారు.  ఒబేసిటీతో బాధపడుతున్న వారు: బొజ్జ ఉండడం ఒక సంపద అంటూ ఒబేసిటీతో బాధపడుతున్న వారు తమకు తాము సరదాగా సర్దిచెప్పుకుంటూ ఉంటారు. చాలా మంది వరకు ఒబేసిటీతో గుండెజబ్బులు వస్తాయి గనుక.. ఆ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి. అధిక బరువును మనం ఏం చేయగలం? అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఒబేసిటీ వల్ల ఇంకా అనేక రకాల ఆరోగ్యసమస్యలు కూడా ఉంటాయి.

మూత్రపిండాలు దెబ్బతినడం కూడా అలాంటి పొంచి ఉండే ప్రమాదాల్లో ఒకటి. రక్త పోటు మామూలుగా ఉన్న వ్యక్తుల్లో కూడా.. వారు అధికబరువు ఉండే వారైతే గనుక.. మూత్రపిండాలపై రక్తపోటు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందిట. మరీ ఎక్కువ బరువున్న వారిలో మరీ ఎక్కువగా ఉంటుందిట. నెదర్లాండ్స్‌లోని మెడికల్‌ యూనివర్సిటీవారు ఈ పరీక్షలు నిర్వహించారు. నెఫ్రాలజీపై వచ్చే సంచికలో ఈ వివరాల్ని ప్రచురించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: