మనం రైల్వే స్టేషన్లోగాని, బస్ స్టాండ్లలో కాని, ఏయిర్ పొర్టులలో కాని మరెక్కడైన టాయిలెట్ వాడుకొని దానికి ఎంతొకొంత డబ్బిస్తాం. సులబ్ కాంప్లెక్స్ పేరుతో గ్రీన్ టాయిలెట్లుగా నగరాల్లో ఈ సదుపాయం ఉంది. స్వచ్చ భారత్, పర్యావరణ పరిశుభ్రత ప్రభుత్వం విరివిగా ప్రజాధనం ఖర్చు చేస్తొంది. వినియోగించుకున్న వాళ్ళకు జేబుకు భారం కూడా!


Image result for science valden pevilien


కాని తెలివైన కొరియావాళ్ళు మీరు మా  టాయిలెట్ వాడుకొని మీరే ఎదురు డబ్బు తీసుకొండి అంటూ అద్భుతమైన వాతావరణాన్ని గ్రీన్ టాయిలెట్లలో కలిపిస్తున్నారు. అలోచన, మెదళ్ళకు పడును పెట్టి ఆలోచించి మల మూత్రాలనుంచి కూడా వాసన రహిత జీవ ఏరువులను తయారు చేస్తూ పరిశుభ్రత తో పాటు స్వచ్చ కొరియాను నిర్మించుకుంటున్నారు.




టాయిలెట్లలో ఉండే యంత్రాలు ముందు మానవ విసర్జనాల (వ్యర్ధాలు) నుండి నీటిని వేరు చేసి, మిగిలిన భాగానికి కొన్ని సూక్మజీవులతో సంతులితం చేసి వాసనలేని బయో మాన్యూర్స్ తయారు చెస్థారు. ఈ ప్రోసెస్ లో విడుదలయ్యే కార్బనుడయాక్సైడ్ ను బయోడీజిల్ ఉత్పత్తికి వాడే నాచు పెంపకానికి వినియోగిస్తారు. మిథేనుగాస్ లను ప్రత్యక్షంగానే ఇందనం గానే వాడతారు. ఈ టాయిలెట్ "సైన్స్ వాల్డెన్ పెవిలియన్" అని పిలుస్తారు కొరియన్లు.


Image result for Green Toilets - Science Valden Pevilien



వినియోగదారులను రప్పించేందుకు ఒక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ కూడా డెవలపుచేశారు. చక్కటి కన్వీనియెన్స్, కంఫర్ట్, మర్యాదతో కూడిన పేమెంట్ ఉంటే ప్రతి ఒక్కరు ఈ టాయిలెట్లను విరివిగా వాడుకొండి డబ్బుసంపాదించుకోండి అంటూ ప్రచారం చేస్తున్నారు వీటి నిర్వాహకులు. సృజనాత్మక ప్రయోగాలకు, ప్రయోజనాలను సాధించటానికి కొరియన్ల తరవాతే ఎవరైనా. 



మేక్ ఇన్ ఇండియాలో అని పాట పాడే ప్రధానిగారు గమనించండి. సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్స్ కు, డ్వాక్రా స్త్రీలకు గ్రామాలలొ ఈ కాంప్లెక్స్ ను నిర్వహించ వచ్చు. స్టార్టప్స్ కు ఈ టాయిలెట్ మిషనరి తయారీ పరిశ్రమకు ఇదో మంచి అవకాశం. 

మరింత సమాచారం తెలుసుకోండి: