మునగాకులూ మహా ఔషధాలే ఆహారపు విలువలు ఎక్కువగా ఉండే ఆకు కూరల్లో ‘ మునగాకు’ ఒకటి మనలో చాలామందికి మునగాకులో ఎన్నో ఔషధ విలువులు ఉన్నాయనే విషయం తెలీదు. మునగాకు శరీరానికి మేలు చేసే మొనగాడుగా చెప్పవచ్చు. తోటల్లో మునచెట్లు ఎక్కువగా ఉంటాయి, చాలామంది పెరట్లో కూడా ఈ మొక్కను పెంచుతారు. కానీ ఆకును కూరగా వండుకుంటారని, దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని చాలామందికి తెలియదు. దీనిలో అధికంగా ఉండే ఖనిజ లవాణాలు, విటమిన్లు శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. మునగాకులో విటమీను –ఎ, విటమిన్ సి, కాల్షియం ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా మాంసకృత్తులు కూడా ఉన్నాయి. మునగాకులో ఔషధ గుణాలు విస్తారంగా ఉన్నాయి. మునగ ఆకు రసం, నిమ్మరసం కలిపి ముఖానికి ప్రతిరోజూ ఉదయం రాసుకోంటే వయసులో వచ్చే మొటిమలు నివారింకబడతాయి.


ముఖం అందం పెరుగుతుంది. మునగ పువ్వులు- చిగుర్లు కూరగా వండుకొని తింటే కీళ్ళ జబ్బులు రావు. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్ శాతం పెరిగి ఆరోగ్యాన్ని పెంచుతోంది. మునగాకులో విటమిన్—ఎ అధికంగా ఉంది. మరే ఆకులో లేనంతగా ఎ విటమిన్ దీనిలో ఉంది.  మునగాకు కాడా నుంచి తీసిన రసాన్ని గాయాలకు రాస్తే యాంటి సెప్టిక్ గా గాయాలను నయం చేస్తుంది. మునగాకు రసం, ఉప్పు కలిపిన రసం కొద్దిగా సేవిస్తూ ఉంటేఅజీర్ణం తగ్గిపోతుంది. ఒక చెంచా మునగాకు రసంలో కొంచెం తేనె కలిపి రోజూ నిద్రపోయే సమయంలో తాగితే రేచీకటి తగ్గిపోతుంది.


ఒక చెంచా మునగాకు రసంలో కొంచెం తేనెను కలిపి, దానికి ఒక గ్లాసు లేత కొబ్బరి నీరును కలిపి తీసుకుంటే కలరా, విరేచనాలు తగ్గుతాయి. మునగాకు రసం ప్రతిరోజూ కొద్దిగా తాగితే అలసట పోయి ఉత్తేజం కలుగుతుంది. మునగాకును పాలు కాసి కాగబెట్టి, ఆ పాలను తాగుతూ ఉంటే వీర్యవృద్ది కలుగుతుంది. మునగాకు రసంలో కొంచెం నిమ్మరసం వేసి తాగితే ఆకలి పుడుతుంది. గర్భిణీ స్త్రీలు గర్భం ధరించినప్పటి నుండి ప్రసవం అయ్యేంతవరకూ మునగాకు రసం కాచి చల్లార్చి వడగట్టి పాలతో కలిప తీసుకుంటే సుఖ ప్రసవం అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: