ఆభరణాలు పెట్టుకోవాలంటే చెవి, ముక్కు భాగాల్లో మాత్రమే కుట్టించుకోవడం జరిగేది పూర్వం. కానీ ఇప్పుడు శరీరంలో చాలా చోట్ల రింగులు తగిలిస్తున్నారు. సంప్రదాయానికి పెద్దపీట వేస్తూనే ఆధునికంగా కపిపించాలన్ని తహతహ నగర యువతులకు ఎక్కువైపోయింది. ‘పియర్సింగ్’ టీ పిలిచే రింగులను పెట్టుకోవడం ఇటివల కాలంలో ఎక్కువగా కపిస్తున్న ఫ్యాషన్. కానీ నేటి ట్రెండ్ ఏంటంటే... ముక్కు, కన్ను భాగం, నాలుక, నాభి ప్రాంతాల్లో రింగులు కుట్టుంచుకోవడం. అందం మాటెలా ఉన్నా కొన్నిసార్లు వీటి కారణంగానే ఇన్ఫెక్షన్లు వచ్చిలు ప్రాణాంతకం అయ్యే ప్రమాదముంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫెక్షన్ల బారినుండి తప్పించుకోవచ్చు. అవేమిటో చూద్దాం.. సున్నితమైన శరీరభాగాల్లో రకరకాల లోహాలతో చేసిన ఈ రింగులు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకి తరచూ దురద పెట్టడం, పుండుగా మారడం జరుగుతుంది. అందుకే పియర్సింగ్ చేయించాక డెటాల్ తో శుభ్రం చేసుకోవాలి. వాపు తగ్గేందుకు నియోస్ఫోరిన్ అనే యాంటీబయాటిక్ క్రీమ్ వాడాలి. నోట్లో కుట్టించుకున్నప్పుడు ఇలాంటివి కుదరదు. పియర్సింగ్ చేయించుకున్న రెండు రోజుల్లో గాయం మానిపోవాలి. అలా జరగకపోతే అనుభవజ్ఞులైన డాక్టర్ల దగ్గర చూపించుకోవాలి. అనుభవం, నైపుణ్యం లేనివారి వద్ద కుట్టించుకోకూడదు. ఇంకా సమస్యలు ఎదురైతే సెలైన్ ద్రావణం తయారవుతుంది. దీంతో ఆయా భాగాలను శుభ్రపరిస్తే ఇన్ఫెక్షన్ల బారినుండి కాపాడుకోవచ్చు. బంగారం కాకుండా ఇతరత్రా పీయర్సింగ్ లు వాడితే కొందరి చెవులు పుండ్లు పడతాయి. ఇలాంటి వారు గాయాలను శుభ్రపరిచేందుకు వాడే హైడ్రోజన్ సెరాక్సైడ్ లో దూదిని ముంచి చెవి రెండు వైపులా శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఇలా రెండుసార్లు చేస్తే ఇన్ఫెక్షన్లు రాదు. నాలుకపై కుట్టుంచుకుంటే భ్యాక్టీరియాను నాశనం చేసే నాన్ ఆల్కాహాలిక్ మౌత్వాష్ తో పుక్కిలించిన తర్వాత ఆహారం తీసుకోవాలి. ఒకసారి పుండు పడితే పూర్తిగా నయం అయ్యేవరకు ఆభరణాలను పెట్టకూడదు. సమతుల ఆహారం తీసుకుంటే గుల్లలు, గాయాలు త్వరగా మానతాయి. విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా లభించే ఆహారపధార్థాలు తీసుకోవాలి. కారం మసాలాలు అధికంగా దట్టించే తినుబండారాలకు దూరంగా ఉండాలి. కెఫిన్ ఆల్కాహాలుకు దూరంగా ఉండాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: