ఊబకాయం, మధుమేహం లాంటి జబ్బులతో ఈ మధ్యకాలంలో ఎక్కవుమంది ఇబ్బందులు పడుతున్నారు. వీటినుంచి బయటపడేందుకు అనేక రకాల మందులను వాడుతూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే అలాంటి రోగాలను నిరోధించడంలో పెసర మొలకలు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు డాక్టర్లు.


పెసర్లు అన్ని చోట్ల దొరకుతుంటాయి. పెసర మొలకల్ని వేటిలో కలపకుండా వాటిని విడిగా తీసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. పెసర గింజల్లో కంటే మొలకల్లోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయి. వీటి మొలకల్లో మాంగనీస్‌, కాపర్‌, ఫొలేట్లూ, రైబో ప్లెవిన్‌, విటమిన్‌కె, సి, పోటాషియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం, ఇనుమూ, విటమిన్‌బి6, నియాసిన్‌, థయామిన్‌, ప్రొటీన్లూ అధికంగా లభిస్తాయి.


మధుమేహం ఉన్నవారు పెసర మొలకల్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర, గ్లూకోజ్‌స్థాయులు అదుపులోకి వస్తాయి. వీటిలో ఉండే పాలీ ఫెనాల్స్‌శరీరానికి అందడం వల్ల క్యాన్సర్‌కారకాలు దరిచేరవని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


మొలకలు తినడం వల్ల పైటోన్యూట్రియంట్లు అందుతాయి. వాటితో రోగ నిరోధక శక్తి మెరుగువుతుంది. రకరకాల ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు దరిచేరవు. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను త్వరగా దూరం చేసుకోవాలంటే ప్రతిరోజూ పెసర మొలకల్ని తినడం మంచిది. వాటి వల్ల కాలేయం శుభ్రపడుతుంది.


కొందరికి నాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోతుంది. అలాంటి వారు మొలకల్ని తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వడం వల్ల ఆ సమస్య ఇబ్బంది పెట్టదు. మొలకల్లో లభించే విటమిన్‌కె వల్ల గాయాలైన చోట త్వరగా రక్తం గడ్డ కడుతుంది. బలహీనంగా ఉన్న చిన్నారులకు వీటిని ఇవ్వడం వల్ల శక్తి అందుతుంది. వీటిలోని ప్రొటీన్లు నీరసం రాకుండా చూస్తాయి. సాధారణంగా మొలకల్లో కొలెస్ట్రాల్‌శాతం తక్కువ. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తింటే మంచిది. వీటిని తరుచుగా తీసుకోవడం వల్ల ఆకలి వేయదు. నీరసం రాదు. కడుపునిండిన భావన కలుగుతుంది. దీంతో ఆటోమెటిక్‌గా బరువు తగ్గే ఛాన్స్‌ఉంటుందని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: