స్ట్రెచ్‌ మార్క్‌ మహిళలను బాగా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని దాచుకోవడానికి వాళ్లు చేయని ప్రయత్నం ఉండదు. బాడీలో స్ట్రెచ్ మార్క్స్ చేతులు, కాళ్ళ మీద మాత్రమే కాదు, మర్మాంగాల్లోనూ, పొత్తి కడుపుతో పాటు బాడీలో మరికొన్నిభాగాల్లో కూడా ఏర్పడుతాయి. అయితే, చాతీ మీద స్ట్రెచ్ మార్స్ ఏర్పడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. వీటిని తొలగించుకునేందుకు చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు. కానీ అవి అంత ఈజీగా పోవు. వీటిని పోగొట్టుకునేందుకు ఏవైనా ఆయింట్‌మెంట్లు ట్రై చేస్తే మరింత ఇబ్బందిగా మారే ప్రమాదం లేక పోలేదు.


మహిళల శరీరంలో చాతీ సున్నితమైన భాగం, కాబట్టి, ఆ ప్రదేశంలో హానికరమై కెమికల్స్ ను ఉపయోగించడం మంచిది కాదు. కానీ సున్నితమైన హెర్బల్ రెమెడీస్ ను ఉపయోగించి బ్రెస్ట్ మీద స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవచ్చు. జనరల్‌గా ఛాతీ మీద ఉన్న స్కిన్ మూడు లేయర్స్ గా ఉంటుంది. చర్మంలోని టిష్యులు ఎక్సెస్ గా స్ట్రెచ్ అవ్వడం వల్ల, చర్మం క్రింద లేయర్ మీద స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. ఛాతీ వద్ద ఎలాంటి మజిల్స్ లేదా బోన్స్ ఉండవు, ఇది సహజంగా ఏర్పడి ఫ్యాట్ టిష్యులు. కాబట్టి, ఇది బాడీ మాస్ ఇండెక్స్ విస్తరించడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. అదేగాక బ్రెస్ట్ విస్తరించడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. ఇంకా ప్రెగ్నెన్సీ సమయంలో, పబ్బరిటి లేదా ఎక్సెస్ వెయింట్ లాస్ లేదా ఎక్సెస్ బాడీ వెయిట్ వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. 


సున్నితమైన ప్రదేశంలో స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకోవడానికి నేచురల్ పద్దతులున్నాయి. స్ట్రెచ్ మార్క్స్ ను మనం ఇంట్లో స్వయంగా తొలగించుకోవచ్చు. అయితే ఇవి పూర్తిగా తొలగిపోవు కానీ, కొంత వరకూ షేడ్ అయిపోతాయి. ఛాతీ మీద, చాత్రీ క్రింది భాగంలో చారలు, లైన్స్ లేదా స్టెచ్ మార్క్ తొలగిపోవడానికి కొన్ని హోం రెమెడీస్‌ ఉన్నాయి. పంచదార స్పటిక రూపంలో గరుకుగా ఉంటుంది, దీన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో మర్దన చేయడం వల్ల స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ అవ్వడంతో పాటు, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ను నివారిస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ ను తేలికపరుస్తుంది. ఇందుకోసం పంచదార 1 టేబుల్ స్పూన్, బాదం నూనె 10 చుక్కలు, నిమ్మరసం 1 టీస్పూన్ తీసుకుని ఒక బౌల్లో బాగా మిక్స్ చేయాలి, ఈ మిశ్రమంను బ్రెస్ట్ పై అప్లై చేసి, సున్నితంగా మర్ధన చేయాలి. మర్ధన చేసిన తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా స్ట్రెచ్ మార్క్స్ కనిపించకుండా పోతాయి.


ఆముదం నూనె కూడా బాగా పనిచేస్తుంది. ఆముదంలో ఓమేగా 6, ఓమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ అత్యధికంగా ఉంటాయి. ఆముదం నూనె చర్మంలోకి పూర్తిగా చొచ్చుకుని పోయి, స్కిన్ రీజనరేట్ చేస్తుంది. దాంతో స్ట్రెచ్ మార్క్స్ లైట్ గా మారిపోతాయి. వెల్లకిలా, నిటారుగా పడుకుని, ఆముదం నూనె చేతిలో వేసుకుని చాతికి అప్లై చేసి మసాజ్ చేయాలి. తర్వాత క్లీనింగ్ వ్రాప్ ను చుట్టుకుని, హీట్ పాడ్ తో 20 నిముషాలు హీట్ చేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఈ వ్రాపర్ లాగేసుకుంటుంది. ఇలా ఒక వారం రోజులు పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: