రోజూ ఓ కోడిగుడ్డును ఆహారంతోపాటు తినడం కంటికి చాలా మంచిదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఒక కోడిగుడ్డులో ఆరు గ్రాముల హై-క్వాలిటీ ప్రోటీన్లు, 9 గ్రాముల అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడు, గుండెకు ఎంతో మేలు చేస్తాయి. కోడిగుడ్డు రోజూ తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్ పెట్టవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు కూడా కోడిగుడ్డు చెక్ పెడుతుంది. అంతేగాకుండా.. ఒక కోడిగుడ్డులో ఐదు గ్రాముల ఫాట్ ఉంటుంది. అలాగే 300 మైక్రోగ్రాముల కొలైన్ ఉంటుంది.


ఇది మెదడు వ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. నాడీ మండలాన్ని పటిష్టం చేసి, గుండెను పదిలంగా ఉంచుతుంది. విటమిన్ "డి" కలిగిన గుడ్డును వారానికి ఆరేసి తీసుకుంటే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ 44 శాతం తగ్గిపోతుందని అధ్యయనంలో తేలింది.


కురులకు, గోళ్లకు మేలు చేసే సల్ఫర్ కంటెంట్ గుడ్డులో ఎక్కువే ఉంది. విటమిన్స్, మినరల్స్‌ అధికంగా గల కోడిగుడ్డును రోజూ బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చునని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: