రోజుకు మూడు గ్లాసుల త్రాగితే 18 శాతం వరకు గుండె జబ్బు ప్రమాదం నుంచి ఉపశమనం పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వాగెనిన్‌గెన్, హార్వార్డ్ యూనివర్శిటీ పరిశోధకులు యూరఫ్, అమెరికా, జపాన్‌ దేశాలలో జరిపిన 17 అధ్యయనాలలో అధికంగా పాలు తీసుకోవటం ద్వారా గుండె జబ్బు పెరగినట్లు తేలలేదు. పాలు మంచి పౌష్టికమైన ఆహార పదార్ధం, పాలలో కాల్షియం, పొటాషియం, ప్రొటీన్ వంటి పోషకాలు ఉంటాయని గ్లోబల్ డైయిరీ ప్లాట్‌ఫామ్ టెక్నికల్ డైరక్టర్ కిన్డే తెలిపారు. అమెరికా జర్నల్ ఆఫ్ క్లీనికల్ న్యూట్రిషన్ ప్రచురించిన ఇజ్రాయెల్ అధ్యయనం ప్రకారం అధిక కాల్షియం గల పాలను తీసుకుంటే బరువు కోల్పేయే అవకాశం ఉందని తేలింది. రెండు సంవత్సరాల పాటు 300 మంది పురుషులు, మహిళలపై జరిపిన ఈ అధ్యయనం ప్రకారం స్వల్ప మొతాదులో కాల్షియం గల పాలు తీసుకున్న వారి కంటే అధిక మొత్తంలో కాల్షియం గల పాలు తీసుకున్న వారు 38 శాతం మంది బరువు కోల్పోయినట్లు తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: