మనలో చాలా మందికి బీరు తాగడం అలవాటు ఉంటుంది. అయితే ఈ బారు తాగడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్‌ ఉంటాయని అంటారు. మరి వాటిలో నిజమెంత..? ఒకవేళ బీరు తాగినా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?


ఈ మధ్య కాలంలో ఎక్కువగా అమ్ముడవుతున్న పానియాల్లో బీర్‌ టాప్‌లో ఉంటుంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు కూల్‌ డ్రింక్స్‌  కంటే బీర్లు ఎక్కువగా అమ్ముడవుతాయంటే అతిశయోక్తి లేదు. అంతలా జనం బీర్లను స్వాహా చేసేస్తున్నారు. మన దేశంలోనే కాదు బీర్ ను ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తాగుతుంటారు. అయితే దీన్ని తాగడం వల్ల పొట్ట వస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే బీర్ మానకుండా కూడా పొట్ట చుతూ ఉండే కొవ్వును తగ్గ్గించుకోవచ్చు.


ఒక్క వేసవి కాలం అనే కాదు అన్ని కాలాల్లో సేవించే ఈ బీరు వలకల పొట్ట పెరుగుతుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే అలా బాధపడే వారు సాధారణంగా తాగేదాని కన్నా కాస్త  తగ్గించండి. ఇలా పరిమితంగా బీర్ తాగటం వలన శరీరానికి అందే కేలోరీల సంఖ్య కూడా తగ్గించినవారవుతారు. ఇలా తక్కువగా తాగటం వలన శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు శక్తిరూపంలోకి మార్చబడుతుంది.


ఆల్కహాల్ స్థాయిలు తక్కువగా ఉండే బీర్ లను లేదా 100 కేలోరీలను అందించే బీర్ లను మాత్రమే తాగటం వలన కొవ్వు పదార్థాల పెరుగుదలను అరికట్టవచ్చు. అలాగే మీరు తాగే ప్రతి బీర్ తరువాత ఒక గ్లాసు నీరు తాగటం వలన మితిమీరిన స్థాయిలో బీర్ తాగలేరు. అంతేకాకుండా, జీర్ణక్రియ మెరుగుపడటమేకాకుండా, జీవక్రియ కూడా సజావుగా సాగుతుంది.


చాలామంది ఆల్కహాల్‌ తీసుకుంటూ ఏది కనిపిస్తే అది తింటుంటారు. ఇది చాలా ప్రమాదకరం. బీర్ తాగేపుడు అనారోగ్యకర కొవ్వు పదార్థాలకు బదులుగా, ఆరోగ్యకర ఫుడ్‌ను తీసుకోవటం వలన శరీర జీవక్రియను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడుతుంది. 


శరీర బరువు తగ్గించుకోవాలి అనుకునే వారు వ్యాయామాలను తప్పక చేయాలి. వీటి వల్ల పొట్టభాగం, తొడలు, పిరుదుల వద్ద ఉండే కొవ్వు పదార్థాలు కరిగించబడతాయి. రన్నింగ్, జంపింగ్ రోప్, స్విమ్మింగ్, ఎరోబిక్స్,  సైక్లింగ్ వంటి వ్యాయామాలు కొవ్వు పదార్థాలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. మీరూ ట్రై చేసి చూడండి.


మరింత సమాచారం తెలుసుకోండి: