రోగాలను సామూహిక ప్రార్థనలు నయం చేస్తాయన్న విశ్వాసం బహు ప్రాచుర్యం పొందింది. ఇలాంటి ప్రార్థనల ద్వారా రోగాల నుండి జనులకు తాత్కాలికమైన ఉపశమనము కలుగుతుందని కొన్ని ఘటనలు తెలుపుతున్నవి. అతీంద్రియ ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సామూమిక ప్రార్థనల వల్ల ఒంటిలో వాపు మాయం అవుతోంది. దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి. హై బ్లడ్ ప్రెషర్ మరియు అలాంటి సమస్యలు తొలగినట్లుగా నిర్థారణ అవుతున్నది. వాస్తవానికి ఇలాంటి చికిత్సలో విశ్వాసం ప్రధాన పాత్ర తీసుకుంది. వైద్యుడిపై విశ్వాసం లేకపోతే ఇలాంటి అద్భుతాలకు అవకాశం తక్కువ. స్రావ్యమైన భవ్య సంగీతంతో కూడిన లయ మాధుర్యంలో రోగి మైమరిచి ఓ విచిత్ర భావ స్థితిలోకి వెళ్లిపోతారు. ధృఢ విశ్వాసం మానసిక- చికిత్స ప్రభావాన్ని రోగిపై కలిగిస్తుంది. ఇలాంటి చికిత్సా విధానాన్ని మానసిక వైద్యులు సైతం గుర్తించారు. ఇలాంటి మానసిక సంబంధమైన చికిత్సలు అనేక రోగాలను మరియు రుగ్మతలను తొలగించగలవని నిరూపితమౌతున్నది. సామూహిక ప్రార్థనలలో మానసిక చికిత్స సంబంధమైన విషయాలు దాగి ఉన్నాయని మనకు అర్థమౌతుంది. అదే ఈ ప్రార్థనలు సాధిస్తున్న విజయానికి కారణం. 

మరింత సమాచారం తెలుసుకోండి: