ఎండలు మండేకాలంలో మధ్యాహ్నాం వేళ తిరిగి వచ్చే వారికి ఓ గ్లాసుడు చల్లని మజ్జగ ఇస్తే ప్రాణం లేచొస్తుంది. దేహానికి మజ్జిగ చేసే మేలు అంతా ఇంతాకాదు. పేగులకు, పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్లి వంటి పధార్థాలు ఇందులో ఉంటాయి. విరేచనాలు, వాంతులు అధికదాహం వంటి సమస్యలు... లేదా నీరసం కాళ్లు తిమ్మిర్లు తలెత్తినపుడు మజ్జిగలో ఉప్పకానీ, పంచదారకానీ వేసుకునితాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. ఎన్నిరకాలుగా తయారు చేయొచ్చు? మట్టిపాత్రలో పెరుగుతోడు పెట్టి దాన్ని మజ్జిగ చేసుకుని తాగితే మంచి గుణవర్థకంగా పనిచేస్తుందని ఆయుర్వేధం చెబుతుంది. అంతేకాదు దీన్ని నాలుగు రకాలుగా చేయవచ్చు. 1. పెరుగులో నీళ్లు కలపకుండా చిలికినది కొంచెం బరువు చేస్తుంది. 2. పెరుగుకు సమంగా నీళ్లు చిలికినది... కొంచెం బరువు చేస్తుంది. 3. పెరుగుకు రెండింతలు నీళ్లు చిలికినది మంచిది. 4. నాలుగు నాలుగింతలు నీళ్లు కలిపి చిలికినది శరీరానికి హాని చేయదు. ఒంటిని తేలిక పరుస్తుందిజ  దీన్ని మజ్జిగ తక్రం అని పిలుస్తారు. ఈ రోగానికి ఇలా... 1.శరీరం ఆర్చుకుపోయినట్లుగా ఉండే వాతరోగులు పుల్లని మజ్జిగలో సైంధవలవణం కలిపి తాగాలి.  2. ఫైత్యరోగులు, కడుపులో మంటతో బాధపడేవారు తియ్యని మజ్జిగలో పంచదార కలిపి తాగాలి. 3. శ్లేష్మం, ఊబకాయం వంటి సమస్యలుంటే తియ్యని మజ్జిగలో మిరియాలు లేదా శొంఠిపొడివేసి పుచ్చుకోవాలి. ఎలాంటి వారు తీసుకోవచ్చు? ఎవరైనా పుచ్చుకోవచ్చు,  అజీర్ణం, నీరసం, విరేచనాలు, వాంతులు, ఎముకల బలహీనత, కడుపులో మంట, నోటికి రుచి తెలియకపోవడం వంటి సమస్యలున్నవారును, దేహం లేదా చర్మం ఎండిపోయినవారు గర్భవతులు వృద్ధులు ఎవరైనా పులవని మజ్జిగ పుచ్చుకోవచ్చు. ఎవరు తీసుకోకూడదు? తరచూ ఆయాసం, జలుబు, ముక్కుకారడం, తలనొప్పి బాధితులు, మూర్చరోగులు మజ్జిగ తీసుకోకపోవటం మంచిది. ఇవీ తెలసుకోండీ!  మజ్జిగను వేడిచేస్తే అజీర్ణం చేస్తుంది. పుల్లటి మజ్జిగ కడుపులో మంట పెంచడంతోపాటు అజీర్ణమూ చేస్తుంది. విరుగుడు : పంచదార, సైంధవలవణం, మిరియాలు అల్లం వేసిన మజ్జిగ పుచ్చుకుంటే ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: