అధిక బరువు, లావు పొట్ట, అందానికి, ఆరోగ్యానికీ సమస్యాత్మకంగా మారతాయి. ఈ అధికబరువు, లావుపొట్ట వల్ల గురకనుంచి గుండె జబ్బుల దాకా, బిపి నుంచి షుగర్ దాకా పలురకాల వ్యాధులకు కారణం కావచ్చు. పైగా ఇవి తీవ్రమైన ఆత్మన్యూనతకు కూడా దారి తీస్తాయి. తొడలు, బాహువులు, గెడ్డం, నడుముపైన బాగా ఉబ్బెత్తుగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోవాలంటే మాటలా? అంటే అందుకు సమాధానంగా "ఒక ప్పుడైతే, బరువు తగ్గించుకోవడం కష్టం, కొవ్వు తగ్గించుకోవడం మరీ కష్టం. . కానీ, లితి స్లిమ్మింగ్ అండ్ కాస్మటిక్ క్లినిక్‌లో ఈ రెండూ చాలా సులభం'' అంటున్నారు డాక్టర్ శ్వేత. అధిక బరువుకు కారణాలు అనేకం. వీటిలో శరీర శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, సమయపాలనలేని భోజనం, ఎక్కువ గంటలు కదలకుండా కూర్చునే ఉద్యోగ, వ్యాపారాలు. వంశానుగత మూలాలవంటివి ప్రధాన కారణాలుగా ఉంటాయి. వీటితో పాటు స్త్రీలలో ఎక్కువమంది సంతానం కలిగాక బరువు పెరిగిపోతుంటారు. అధిక బరువుతో అన్నీ సమస్యలే... శరీరం బరువు పెరగడం మొదలయ్యిందీ అంటే, పలురకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. వాటిలో అధికరక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు ప్రధానం. స్త్రీలలో అయితే, రుతుక్రమంలో వ్యత్యాసాలు, అవాంచిత రోమాలతో పాటు , మెడమీద, నుదుటిమీద పిగ్మెంటేషన్ సమస్యలు మొదలవుతాయి. పురుషుల్లో రొమ్ములు ( గైనకోమాస్టియా) పెరగడం, ముఖం మీదే కాకుండా వీపు మీద కూడా మొటిమలు రావడం ఉంటుంది. వీటితో పాటు ఏకాస్త నడిచినా, ఏచిన్న పనిచేసినా విపరీతంగా ఆయాసం వస్తుంది. ఇన్నిన్ని సమస్యలకు కారణమయ్యే స్థూలకాయాన్ని తగ్గించుకోవడం ఎవరికైనా తప్పనిసరి. అలా తగ్గించుకోవడానికి వరల్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో భాగంగా వచ్చిన నాన్-సర్జికల్ లైపోసక్షన్ ఎంతగానో ఉపకరిస్తుంది. బిసిఎ (బాడీ కంపోజిషన్ అనలైజర్) అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికోసం మా వద్ద ఉన్న బాడీ కంపోజిషన్ అనలైజర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ అనలైజర్ ద్వారా బాడీ కంపోజిషన్‌ను విశ్లేషించి, దానితో పాటే ఆహారపు అలవాట్లను సమీక్షించి మీరు బరువు పెరగడానికి గల అసలు కారణాల్ని గుర్తిస్తారు. మీ శరీర ధర్మాన్ని ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని, ఈ చికిత్సలో ఎన్ని సిట్టింగ్స్ అవసరమో నిర్ణయిస్తారు. నాన్-సర్జికల్ లైపోకేవిటేషన్ ఈ చికిత్సా విధానం ఎంతో సులభతరంగా ఉంటుంది. ఈ విధానంలో శరీరం మీద రంద్రం చేయడం గానీ, కుట్లు వేయడం గానీ ఉండవు. అందుకే ఏమాత్రం నొప్పి కలగదు. శరీరం పైనుంచే లో-ఫీక్వెన్సీ ఆల్ట్రాసోనిక్ వేవ్స్‌ను పంపించడం ద్వారా ఫ్యాట్ సెల్స్‌ను తొలగించడం ఈ విధానంలో జరుగుతుంది. ఈ చికిత్స కోసం వారానికి రెండుసార్లు మా క్లినిక్‌కు రావలసి ఉంటుంది. చికిత్సకు ముందు.... ఈ ట్రీట్‌మెంట్‌కు ఏ విధమైన ముందు జాగ్రత్తలూ అవసరం లేదు. మా క్లినిక్‌లో అడ్మిట్ కావలసిన అవసరం కూడా లేదు. అలాగే, మందులు కానీ, ఏ విధమైన పొడులు కానీ, ఇవ్వడం ఉండదు. వారానికి రెండు సార్ల చొప్పున మీరు క్లినిక్‌కు వచ్చినప్పుడే ట్రీట్‌మెంట్ అంతా ఉంటుంది. మీరు ఎవరినీ తోడుగా తెచ్చుకోవలసిన అవసరం కూడా లేదు. ఒక్కరే వచ్చి ట్రీట్‌మెంట్ తీసుకుని వెళ్లిపోవచ్చు. ట్రీట్‌మెంట్ తరువాత కూడా బెడ్‌రె స్ట్ అవసరం ఉండదు. మీ రోజువారి విధుల్ని ఏ ఆటంకమూ లేకుండా చేసుకోవచ్చు. మీ శరీరం స్పందించే తీరు, శరీర ధర్మాన్ని అనుసరించి సిట్టింగ్స్‌కు రావలసి ఉంటుంది. అయితే శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉన్నవారికి మిగతా వారికన్నా తక్కువ సిట్టింగ్స్‌లోనే చికిత్స పూర్తి అవుతుంది. ఈ చికిత్స ద్వారా 5 నుంచి 20 కేజీల దాకా బరువు తగ్గుతారు. ఆర్ ఎఫ్ (రేడియో ఫీక్వెన్సీ) నాన్-సర్జికల్ లైపోకేవిటేషన్ ద్వారా శరీరంలోని కొవ్వు తొలగిపోయినప్పుడు సహజంగానే చర్మం వదులు అవుతుంది. అలా సాగిన చ ర్మాన్ని మళ్లీ బిగువుగా మార్చడం అన్నది మా వద్ద ఉన్న ఆర్ఎప్ మెషిన్‌తో సాధ్యమవుతుంది. చాలా మందికి చేతులు, పొట్ట, తొడలు, గెడ్డం కింద చర్మం వదులై ఊగుతూ ఉంటుంది. అలాంటి వారికి కూడా ఈ చికిత్స బాగా తోడ్పడుతుంది. కొంత మంది స్త్రీలలో గర్భంతో ఉన్నప్పుడు సాగిన పొట్ట, ప్రసవం తర్వాత కూడా మునుపటి స్థితికి రాదు. అలాంటి వారికి ఈ చికిత్స నిజంగా ఒక వరం లాంటిది. జారిన స్థనాలను తిరిగి బిగుతుగా మార్చడానికి కూడా ఈ చికిత్స బాగా ఉపకరిస్తుంది. ఇతర నాన్-సర్జికల్ థెరపీలు మా వద్ద గల సిఓ-2 ప్రాక్షనల్ లేజర్ మెషిన్ ద్వారా స్త్రీలలో ప్రసవం తరువాత ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించి, టోన్ ఇంప్రూవ్‌మెంట్, పిగ్మెంటేషన్, కలర్ ఇంప్రూవ్‌మెంట్ చేయవచ్చు. అలాగే మొటిమలు, గుంటలు, మచ్చల్ని తొలగించవచ్చు. వీటితో పాటే ఫేస్‌లిప్టింగ్, బ్రెస్ట్ లిఫ్టింగ్ కూడా చేస్తాం. మహిళల్ని ఎక్కువ ఇబ్బందికి గురిచేసే అవాంచిత రోమాల సమస్యను లైర-1-ఎన్‌డి-యాగ్ లాంగ్ పల్స్ లేజర్ ద్వారా తొలగించవచ్చు. బట్టతల సమస్యతో బాధపడుతున్న వారికి ఇచ్చే స్టెమ్‌సెల్ థెరపీతో శాశ్వతంగా ఉండిపోయే హెయిర్స్ వచ్చే వీలుంది. కేవలం కొన్ని సిట్టింగ్స్‌లోనే మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమస్యల్ని పరిష్కరించడంతో పాటు ఈ చికిత్సలు వారిలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఏ కారణంగా వచ్చినా అధిక బరువు, దానితో పాటే వచ్చిన ఇతర సమస్యలన్నిటి కీ నిజంగా ఒక గొప్ప పరిష్కార వేదిక.

మరింత సమాచారం తెలుసుకోండి: