నిత్యాకృత్యాలతో అలసి వచ్చిన తరువాత నీటి స్నానము ఎంత హాయిని కలిగించునో మనకందరికీ అనుభవమే ప్రకృతి చికిత్సను అనుసరించి చేయు స్నానములలో కొన్ని రకములు ఆరోగ్యకరమయితే, కొన్ని వ్యాధి ఉపశమనమునకు ఉపయోగించేవి. అందులో అభ్యంగ స్నానం ఒకటి.

అభ్యంగ స్నాన ఇది మన పూర్వీకుల నుండి సాంప్రదాయముగా తెలిపిన ప్రక్రియ దీనినే తైలస్నానము అని కూడా అంటారు. మను స్వేదమును వెడలించుటకు కారణమైన చర్మము ఆరోగ్యమునకు, అంతర్గత అవయవ రక్షణకు ఎంతో దోహదము కలిగించును. కాబట్టి చర్మమును చూసే అతని ఆరోగ్యమును అంచనా వేయవచ్చును. శరీరములోని మలినాలను బహిష్కరించు అవయవములో చర్మము ప్రధానమైనది.

ఈ చర్మము కొందరికి నునుపుగా ఉండవచ్చునను,  ఇంకొందరికి జిడ్డుగా ఉండవచ్చును. మరికొందరికి బిరుసుగా ఉండవచ్చును. ఇదే విధముగా ఎరుపు. నలుపు, లాంటి రంగుభేదాలు కూడా ఉండవచ్చును. చర్మము ఏ విధముగా ఉన్నను శారీరక శీతోష్ణములను క్రమబద్దంగా ఉంచుటలో అతి ముఖ్యపాత్రను నిర్వహిస్తుంది.

శరీరములోని మాలిన్యములు చర్మమందలి సూక్ష్మరంద్రముల ద్వారా స్వేధ రూపములో బయటకు వస్తూ వుంటాయి. చర్మాన్ని బాగా రుద్ది స్నానము చేయకపోతే చర్మమందలి సూక్ష్మ రంద్రాలు పూడిపోయి మాలిన్యములు బయటపడు అవకాశము లేకపోవడముతో తిరిగి రక్తములోనే కలుస్తాయి. ఈ పరిస్థితులలో రక్తము విషతుల్యమైపోయి అనేక వ్యాధి బాదలు కలగుతాయి. ఈ విధముగానే కాకుండా స్వేధరంద్రాలు బాగానే ఉండి. మాలిన్యాలు నిల్వవుండి వైరస్ లాంటి వ్యాధి కారకాలైన సూక్ష్మక్రిములు కూడా సంక్రమిస్తాయి.

చర్మంలో ఒక విధమైన జిగురు పధార్థాలు వుండి చర్మానికి విరుపు కలుగకుండా కాపాడుచుండును. చర్మాన్ని పరిశుభ్రపరుచునప్పుడు ఈజిగురు పధార్థాము ఉత్పత్తికాక చర్మము పొలసులు పొలుసులుగా ఉండి విరవిరలాడి బిరుసెక్కును. ఇటువంటి అవలక్షణాలు లేకుండా చర్మము ఆరోగ్యకరమైన సుగుణాలను కలిగి ఉండాలంటే వారానికొకసారైనా ‘అభ్యంగనస్నాన’మాచరించుట మంచిది.

శరీరమంతా తల నుండి పాదాల వరకు నూనెతో మర్థన చేసుకొని సున్నిపిండి, శనగ, మినప, పెసర పిండితో నలుగుపెట్టి సీకాయ, కుంకుడుకాయ నురుగుతో బాగా రుద్దుకొని స్నానము చేయుటను అభ్యంగనము అని తలంటిస్నానము అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: