శస్త్ర చికిత్స, మందు చికిత్స ప్రకృతి చికిత్స, హోమియో చికిత్స ఆహార చికిత్స ఇన్ని చికిత్సలు గురించి చెప్పినా అన్నింటియందు మిళితమై మానవునికి ప్రధానమై, వ్యాధులు నివారణలకు కారణమైన మానవ మనసును గురించి కొన్ని సూచనలు తెలుపకపోతే అసంపూర్తిగానే తెలిపినట్లు అవుతుంది. మనిషి యెక్క మనసు ఏవిధంగా ఉంటుందో దేహము కూడా అట్లా వుంటుంది.

అతని స్వభావములు, ఆహార-విహార కోరికలు కూడా మనసును బట్టి ఉంటాయి. మనిషి ప్రతి చిన్న విషయంలోనూ మనోనిగ్రహము కల్గిఉండాలి. కాఫీ అలవాటు నుండి పొగత్రాగుట, మత్తుమందులు, వ్యాధులు, మనసుకు శాంతిలేని కోరికలు, అతికామేచ్చ మొదలగునవన్నీ మనోనిగ్రహము తగ్గుట వలనే కలుగుచున్నవి.

అంటే మనసుకు తప్పు అని తోచిన విషయములు కూడా ఎన్నో మనము చేయుటకు లేక ఆలోచించుటకు కారణము నిగ్రహము లేకపోవటమే. 
కాబట్టి నిగ్రహములేనిదే ఏ కార్యము నంతు విజయము సాధించలేము.

మనో నిగ్రహమును సాధించటానికి ధ్యానము, ప్రార్థణ, ఆధ్యాత్మిక చింతన ఎంతో సహకరించును. వారివారి అనుకూలతను బట్టి యోగ నిపుణుల వద్దగాని లేక మంచి యోగశాస్త్ర పుస్తకాలను చూసిగానీ నిగ్రహము పొందవచ్చును. మంచి స్నేహితుని వలన కూడా మనశ్శాంతి లభించును.

మరింత సమాచారం తెలుసుకోండి: