ఆవు వ్యర్థాలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే.. అయితే వాటికి శాస్త్రీయ నిరూపణ లేలు. కానీ త్వరలోనే వాటిని సైన్స్‌ పరంగా నిరూపించి  ఔషధాల తయారీలోనూ వాడేలా కృషి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పరిశోశనలకు పచ్చ జెండా ఊపింది సెంట్రల్‌ గవర్నమెంట్‌. ఇందుకుగాను బడ్జెట్‌ లో నిధులు కేటాయింపు సైతం చేసింది.

 

భారతీయులకు ఆవుతో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. తరతరాలుగా ఆవును పూజిస్తూ.. దాని వ్యర్థాలను ఉపయోగించుకుంటూ.. మనుగడ సాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ వ్యర్థాలతో పూర్తి స్థాయిలో ఔషధాలను తయారు చేయాలని సంకల్పించింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా.. ఆవుమూత్రం, పేడతో కలిగే ఉపయోగాలు, వాటిని ఔషధాల్లో ఎలా వాడే అవకాశం ఉందో రీసెర్చ్‌ చేయాలని సూచించింది.

 

ఆవు మూత్రం, పేడతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, వాటి ద్వారా ధీర్ఘకాలిక రోగాలను నయం చేయవచ్చన్నది చాలామంది నమ్మకం. అయితే వాటికి శాస్త్రీయంగా ఎలాంటి నిరూపణ లేక పోవడంతో దానికంతగా ఆదరణ లభించలేదు. ఇదే విషయంపై కేంద్ర సర్కార్‌ దృష్టి సారించింది. ఆవుమూత్రం, పేడ, వాటి పాలు, పెరుగు, నెయ్యితో కలిగే ఉపయోగాలు, ప్రయోజనాలకు సంబంధించి అధ్యయనం చేయాల్సిందిగా సెంట్రల్ రూరల్‌ డెవలప్ మెంట్‌ ఆండ్‌ టెక్నాలజీ ( CRDT) ని గత డిసెంబర్‌ లో ఆదేశించింది. ఇందులో ఐఐటీ ఢిల్లీకి కూడా భాగస్వామ్యం కల్పించింది. ఈ ప్రాజెక్టుకు పంచగవ్య అని  పేరు పెట్టారు.

 

ఈ ప్రాజెక్టు పరిశోధనలు సీఆర్‌డీటీ ప్రొఫెసర్‌  వీరేంద్ర కుమార్‌ ఆధ్వర్యంలో జరుగనున్నాయి. రీసెర్చ్‌ కు సంబంధించి విషయాలపై ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్లతో ఆయన సమావేశం అయి పలు అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ త్వరలోనే ఓ ప్రకటన చేయనుంది. ఆవు మూత్రం, పేడతో ధీర్ఘ కాలంలో కలిగే ప్రయోజనాలకు సంబంధించి ఈ పంచగవ్య ప్రాజెక్టు ద్వారా వెల్లడి కానున్నాయని చెబుతున్నారు ప్రొఫెసర్స్‌. ఈ ప్రాజెక్టు అయ్యే నిధుల విషయంపై ఇటీవలే జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పందించారు. తగిన నిధులు కేటాయిస్తామని. రీసెర్చ్‌ పూర్తయ్యేందుకు సహకరిస్తామని తెలిపారు.

 

ఆవు వ్యర్థాలను ఔషధాల తయారీకి ఎలా ఉపయోగ పడతాయి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత రిపోర్టును కేంద్రానికి సమర్పించనుంది సీఆర్ డీటీ.. ఇందులో వచ్చే రిపోర్ట్స్‌ ఆధారంగా ఆవు వ్యర్థాలను ఎలా వాడలన్నదానిపై స్పష్టత రానుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: