మధుమేహానికి ఎదుర్కొనే అద్భుత ఔషధాలు మన కళ్ళముందు చాలా ఉన్నాయి. మామిడి చెట్టుకి మన రాష్ట్రంలో కరువులేదు కాబట్టి దాని బెరడు కావాలంటే ఎవరైనా కాదనకుండా ఇస్తారు. కాబట్టి చెక్క బెరడు సేకరించి ఎండబెట్టిండి. గింజ తీసేసిన కరక్కాయపై బెరడుని దానికి సమానంగా తీసుకొని మెత్తగా దంచి ఆ పొడిని ఒక సీసాలో భద్రపడిచుకొని రోజూ ఒక చెంచా పొడి ఉదయం సాయంత్రం తీసుకొంటే మధుమేహ వ్యాధి త్వరగా కంట్రోల్లోకి వస్తుంది.


షుగర్ వ్యాధిలో ముందు పాడయ్యేది జీర్ణశయమే... రోజూ సాఫీగా విరేచనం అయ్యేలా చూస్తుంది.. అందుకని ఈ మిశ్రమాన్ని ఎంత తీసుకుంటే సాఫీగా ఒకటి లేదా రెడు విరేచనాలు అవుతున్నాయో చూసుకొని అంత మోతాదుగా నిర్ణయించుకోండి. తుమ్మ చెక్కలాగానే మామిడి చెక్కకూడా ఆడవాళ్లలో వచ్చే తెల్లబట్ట వ్యాధిని తగ్గించి, గర్భాశయ బలంగా వుండేలా చుస్తుంది.


మామిడి టెంకతో కడుపులో పాముల్ని చంపవచ్చు... మామిడి టెంకని మనం అవతల నిర్థాక్షణ్యంగా పారేస్తాం. దానిలోపల పప్పుని తిన్నామంటే నోరు పొక్కిపోతుందేయే మరి. కానీ టెంకలోపల పప్పులో కూడా కొన్ని మంచి ఔషధ గుణాలున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైన గుణం దీనికుంది. కడుపులో పెరిగే పాముల్ని చంపగలగడం అతి తక్కువ మోతాదులో మామిడి టెంకలోపలి పప్పుని పంచధార కలిపి పిల్లలకు పెట్టండి పాములు చస్తాయి... వాంతులు, విరేచనాలు తగ్గుతాయి

మరింత సమాచారం తెలుసుకోండి: