మిరియాలలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ 'కే' మరియు విటమిన్ 'సి' సమృద్దిగా ఉంటాయి. ఇది చాలా ఘాటుగా ఉండటమే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కారణ మౌతున్నాయి. మిరియాలు జీర్ణక్రియ, దగ్గు మరియు సాధారణ జలుబు ఉపశమనంనకు సహాయపడుతుంది. ప్రతి రోజు నల్ల మిరియాలను తినే కోట్లాదిమందికి, ఇది ఒక ఔషధమసాలా అనే విషయం తెలియకపోవచ్చు. అంతేకాక మిరియాల్లో ఖనిజ లవణాలు అపారం మరియు యాంటీ బయాటిక్ లక్షణాలు ఉంటాయి.
మిరియాల అన్నంతో ప్రయోజనాలు:
పొడిపొడిగా ఉడికించిన అన్నం – కప్పు,
సెనగపప్పు – అరకప్పు,
మిరియాలపొడి – రెండు చెంచాలు,
పల్లీలు -అరకప్పు,
పచ్చిమిర్చి – ఆరు,
తాలింపు దినుసులు -ఒకటిన్నర చెంచా,
కరవేపాకు రెబ్బలు – రెండు,
కొబ్బరి తురుము –
నూనె – అయిదు చెంచాలు,
పసుపు – చిటికెడు,
ఉప్పు – తగినంత.
తయారీ విధానం:
అన్నాన్ని వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చుకోవాలి. సెనగపప్పులో కొద్దిగా ఉప్పూ, పసుపూ వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి తాలింపు గింజలు వేయించుకోవాలి. తరవాత పచ్చి మిర్చీ, కరివేపాకూ, పల్లీలూ వేయించాలి. ఇందులో ఉడికించిన సెనగపప్పూ, మరి కొంచెం ఉప్పూ, మిరియాల పొడీ వేసుకునిబాగా వేయించి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలిపితే సరిపోతుంది.
మిరియాల అన్నం తినటం తో సిద్ధించే ప్రయోజనాలు:
మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి. కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచుతాయి. దీంతో శరీరంలో ఉన్న కొవ్వు కరగడమే కాకుండా మలినాలు అన్నీ బయటికి పోతాయి.
మిరియాలతో చేసిన వాటిలో 'ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్' లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి... విశ్రాంతి చేకూరుస్తుంది.
మిరియాల్లో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని 'శరీర రోగ నిరోధక వ్యవస్థ' కు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా, సాధారణ స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది. 'ఆరోగ్యకర రోగ నిరోధక వ్యవస్థ' మరియు జీవ క్రియలు శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వలను నివారించి, బరువు తగ్గుటను ప్రోత్సహిస్తాయి.
రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేరిస్తే చర్మం మరియు జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది. జలుబు దగ్గు గొంతు గరగర ముక్కు దిబ్బడ జీర్ణశక్తిని పెంచటం గొంతును శుభ్రపరచటం కీళ్లనొప్పులు ఉబ్బసం కలరా మలేరియా ఇలా ఎన్నో వ్యాధులకు మిరియాలు ఔషధంలా ఉపయోగపడతాయి.
మిరియాలను ఆహారంలో తీసుకుంటే 'హైడ్రోక్లోరిక్ ఆమ్లం' స్రవించడం ద్వారా జీర్ణ ప్రక్రియను తేలిక చేస్తుంది. అలాగే ప్రేగు మరియు కడుపు సంబంధించిన వ్యాధుల నివారణలో సహాయపడుతుంది.
బాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధుల చికిత్సలో నల్ల మిరియాలు సహాయపడతాయి. మలబద్ధకం, అతిసారం మరియు ఉదర సంబంధిత వ్యాధుల చికిత్సలో నల్ల మిరియాల యొక్క ప్రభావం ఉందని గుర్తించారు.
మిరియాలు 'ఫ్రీ రాడికల్స్' ని శుద్ధిచేయడం ద్వారా క్యాన్సర్ చికిత్సలో సహాయపడుతుంది. అంతేకాక క్యాన్సర్ యొక్క కొన్ని రకాల కార్యకలాపాల ఉదృతిని తగ్గిస్తుంది. చర్మక్యాన్సర్ నివారణలో కూడా సహాయపడుతుంది,
మిరియాలు జీవక్రియను పెంచటానికి సహాయపడి, అవసరంలేని కేలరీలను కరిగించి బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే మిరియాలు స్థూలకాయానికి వ్యతిరేకంగా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఆహారంలో నల్ల మిరియాలను చేర్చుకుంటే కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మిరియాలు ఒక యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. మిరియాలలో ఉండే పెపైన్ యాంటీ డిప్రెసెంట్ గా పనిచేసి నాడీ వ్యవస్థ ఉద్దీపనకు సహాయపడుతుంది. దాని పలితంగా అభిజ్ఞతా సామర్థ్యం పెరుగుతుంది.
మిరియాలలో యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన లైన్స్, ముడతలు, నల్లమచ్చలు, అకాల వృద్ధాప్యచిహ్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి చర్మాన్ని రక్షిస్తుంది. రోజు వారీ ఆహారంలో నల్ల మిరియాలను చేర్చటం ద్వారా చర్మంపై అద్భుతమైన ప్రభావాన్ని చూడవచ్చు.