రాత్రిభోజనం తిన్నాక తీపిపధార్థం తినటం మంచిదికాదు. సరే, కానీ కాఫీ సంగతేమిటి? కెఫైన్ కొవ్వుని కరిగిస్తుంది.అందుకోసమే రాత్రిబోజనంలో తిన్న క్యాలరీలని కూడా కరిగిస్తుంది. ఫట్!  అటుంటి అపోహలు పెట్టుకోవద్దు...  అసలు ఒక విషయం ఏమిటంటే కాఫీ మీ నిద్రని పాడుచేస్తుంది. అది మీకు తెలుసు. అంతేకాక మీ జీర్ణక్రియకి అది అడ్డుపడుతుంది.


ముఖ్యంగా ఇనుము, కాల్షియమ్ లాంటి ఖనిజాలని లీనం చేసుకోవడంలో ఇక ఇనుము, కాల్షియం తక్కువగా ఉంటే కొవ్వు కరగటానికి ఆటంకం ఏర్పడుతుంది. అంతేకాకుండా కాఫీ జీర్ణకోశంలో ఆమ్లాన్ని సృష్టిస్తుంది. అందుకనే మీరు నిద్రలేచేసరికి పొట్ట ఉబ్బరించి, మలబద్దకం ఏర్పడుతుంది.  


ఇక నిర్ధారించుకోవడం ఎలా : ఉదయం నిద్రలేవగానే మీరు పళ్లు తోముకుని అద్దంముందు నిలబడి, మీ నాలుకుని బైటికి చాపి దాని రంగు ఎలా ఉందో చూడండి. దానిమీద మందంగా పాచి కనిపిస్తుంది. ఇవి మీ నాలుకమీద ఏర్పడిన విషపధార్థాలు, రాత్రి నిద్రపోయాక ఇవి ఏర్పుతాయి. మరి ఇంకా మీకు కాఫీ తాగాలనే ఉందా?  

మరింత సమాచారం తెలుసుకోండి: