ఉసిరి..దీనిని రావి ఉసిరి అని కూడా అంటారు..కార్తీక మాసంలో ఈ ఉసిరిచెట్టుకి పూజలు చేసి ఈ చెట్టు సమక్షంలోనే భోజనాలు చేస్తుంటారు..ఇది ఎన్నో పోషకవిలువలు కలిగిఉంటుంది..ఎన్నో ఏళ్ల నుంచీ ఇది మానవుని ఆరోగ్య పరిపక్షణలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ వస్తోంది..అడవులలో నివసించే వారు దీన్ని విరివిగా వాడుతూ ఉంటారు.అంతేకాదు ఆయుర్వేద వైద్యంలో ఉసిరిలేని మందు ఉండదు కూడా..ఉసిరివల్ల కలిగే ప్రయోజనాలు అనేకం..ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఉసిరికి ఉన్న ప్రాముఖ్యత మరే ఫలానికి లేదు అనేది వాస్తవం.

 

 

ఈ ఉసిరికాయని తినడం కంటే కూడా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది ..ఈ  జ్యూస్ లో ఉండే విటమిన్ “సి” ఐరన్ వంటి పోషక పదార్ధాలు వ్యాధులని దూరం చేస్తాయి.శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఉసిరి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఉసిరికాయ ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఇతర ఏ పండ్లలో కానీ, వెజిటేబుల్స్ లో కానీ లేవు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ ఉసిరికాయ జ్యూస్ వలన ఎన్ని రోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

 

శరీర స్థాయి కంటే కూడా ఎక్కువ పరిమాణంలోఉండే కొవ్వుని ఇది కరిగిస్తుంది.అంతేకాదు మెటబాలిజం స్థాయిని కూడా ఇది వృద్ది చేస్తుంది.టాక్సిన్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది.ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది.శరీరంలోపల ఏర్పడే చిన్న చిన్న పూతలు..లేదా రావడానికి సిద్దంగా ఉండే కణితల్ని ముందుగానే రాకుండా నిలువరిస్తుంది.


అంతేకాదు పెద్ద ప్రేగులో ఉండే  టాక్సిన్స్ ను బయటకు నెట్టేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ అందుకు బాగా సహాపడుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవాళ్ళు దీనిని రోజు ఒక గ్లాసుడు త్రాగటం వలన జుట్టు రాలే సమస్య ఉండదు. శరీరంలో రక్తాన్ని సుద్దిచేయడంలో..మరియు హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో ఇది సహాయపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: