ఈ శీతాకాలంలో చాలా మంది ఎదుర్కునే సమస్య ముక్కు దిబ్బడ..శ్లేష్మం..ఇవి ఈ కాలంలో మనిషిని అతలాకుతలం చేస్తాయి..ఎప్పుడు ముక్కునుంచీ నీరు కారుతూనే ఉంటుంది..కొంతమందికి శ్వాస కూడా పీల్చుకోలేని విధంగా అయ్యిపోతుంది..చాలా మంది అటువంటి పరిస్థతిలో నోటి నుంచీ పీల్చుకుంటారు.ఈ రకం సమస్య పిల్లలతో పెద్దలలో కూడా గమనించవచ్చు.ఈ  సమస్యలకి ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉంటారు.కానీ ఆయుర్వేదంలో మంచి సత్ఫలితారు ఇచ్చే అనేకరకాలైన మందులు ఉన్నాయి.

 winter cold problems కోసం చిత్ర ఫలితం

ప్రస్తుతకాలంలో ఇటువంటి సమస్యలని తొలగించటానికి ఆయుర్వేద ఔషదాలు ప్రాముఖ్యం పొందాయి. ఎందుకంటే ఇవి విరివిగా లభించటంతో పాటూ, ఎలాంటి దుష్ప్రభావాలు కలిగించనందు వలన వీటిని ఎక్కువగా వాడుతున్నారు. వీటిలో ముఖ్యమైనది బిషప్ (అజ్వైన్). దీన్ని కొద్ది మొత్తంలో శుభ్రమైన కాటన్  బట్టలో తీసుకొని, మూసి ఉన్న గిన్నెలో ఉంచి వేడి చేయండి తరువాత దీనిని నుండి వచ్చే వాసనను పీల్చటం వలన దిబ్బడ కట్టిన ముక్కు తిరిగి యధాస్థానానికి వస్తుంది.

 

అంతేకాదు మనకి ఎప్పుడు దొరికే వాటితోనే ఎన్నో రకాలైన సమస్యలకి పరిష్కారం దొరికుతుంది ..అలాగే మరికొన్ని పద్దతులు కూడా మనకి ఎంతో ఉపయోగపడుతాయి..వంటి ఇంట్లో మనకి దొరికే వాటితో కూడా మనం ఈ సమస్యకి పరిష్కారం చూపించవచ్చు. అవి ఎలాగో ఇప్పుడు చూదాం

 సంబంధిత చిత్రం

కొన్ని మిరియాలు తీసుకుని వాటిని దంచి..అలాగే తులసి రసం కూడా తీసుకుని..దానికి వెల్లుల్లి రసం కూడా కలపాలి మరియు లవంగం నునే కూడా ఆ మిశ్రమానికి కలిపి దీనిని తీసుకుంటే ముక్కు దిబ్బడం తగ్గుతుంది. అంతేకాదు కర్పూరం మరియు అజ్వైన్ మిశ్రంమాని వేడి చేసి దాని నుండి వచ్చే ఆవిరులు పీల్చినా దిబ్బడ పోతుంది.

 

ఒరేగానో ఆయిల్ రెండు లేదా మూడు చుక్కల ఒరేగానో ఆయిల్ ను జ్యూస్ లో కలుపుకొని తాగటం వలన ముక్కు సమస్యలు పోతాయి ఇది రోగనిరోధక శక్తిగా పనిచేస్తుంది కూడా ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించి ఈ శీతాకాలంలో ఇటువంటి సమస్యలని పోగొట్టుకోవచ్చు.

 ఒరేగానో ఆయిల్ కోసం చిత్ర ఫలితం

 

 



మరింత సమాచారం తెలుసుకోండి: