చాలా మందికి ఎక్కువగా “హై బీపీ” ఉంటుంది కానీ లో బీపీ ఉండేవాళ్ళు చాలా తక్కువ..లో బీపీ నే హైపో టెన్షన్ అని కూడా అంటారు దీని స్థితి 90/60 mm hg కన్నా తక్కువ ఉంటే లో బీపీ ఉన్నట్టే. అయితే అల్ప రక్తపోటు వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. లో బీపీ ఎక్కువగా యువతులలో కనిపిస్తూ ఉంటుంది.దీనికి కారణం మితంగా ఆహరం తీసుకోవడం..తొందర తొందరగా..బయటకి వెళ్ళాలన్న కంగారులో తిండి మీద ధ్యాస లేకపోవడమే. లో బీపి ఉన్న వాళ్ళు ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు..వాంతులు అవడం..కడుపులో వికారంగా ఉండటం వంటివి జరుగుతాయి.లో బీపీ ని పెంచే సులువైన మార్గాలు తెలుసుకుందాం.

 Related image

 నీటిని చాలా తక్కువగా తీసుకునే వాళ్ళకి కూడా ఈ లోబీపి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే..శరీరంలో ఉండే ద్రావణాలు చమట..వాంతులు..ఇలా అనేక కారణాల వలన కోల్పోతాం..ఇలా కోల్పోయిన ద్రావణాలను..మళ్ళీ తిరిగి పొందటానికి..నీటిని త్రాగటం ద్వారా మాత్రమే పొందవచ్చు.బయట ఉండే ఎండ తీవ్రతని బట్టి కూడా లోబీపీ కి కారణం అవుతాయి..ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే లోబీపి ఉన్నవాళ్ళు శరీరాన్ని ఎక్కువగా కూల్ చేసుకోవడానికి ప్రత్నించాలి..అంతేకాదు..ఏసీ సదుపాయం ఉన్నా సరే..లేక చల్లని చెట్టు నీడకి వెళ్లి గాలి తగిలేలా ఎటువంటి ప్రయత్నం చేసినా మంచిదే

 

 

మినరల్స్,విటమిన్స్ లోపాలు వచ్చినప్పుడు కూడా లో బీపీ కలుగుతుంది..అందుకే వాటిని భర్తీ చేయడానికి పండ్లు,కూరగాయలు తింటూ ఉండాలి..ఎక్కువగా ఫ్రూట్స్ తినడం వలన విటమిన్స్ తప్పకుండ దొరుకుతాయి..తద్వారా బీపీ ని పెంచుకోవచ్చు.ముఖ్యంగా విటమిన్స్ లో బిపికి కావాల్సిన విటమిన్స్ ఉన్నాయి అవే B, B12, B9..వీటిలో B 12 రక్తపోటుని కంట్రోల్  చేస్తుంది. ప్రసరణ వ్యవస్థలో ఎటువంటి అవరోధాలు లేకుండా చేయడం దీని ప్రత్యేకత. క్యాబేజీ,కాలీఫ్లోవేర్ వంటి కూరలు తినడం వల్ల కూడా లో బీపీ నుంచీ కాపాడుకోవచ్చు.ఇక రోజు వారీ వ్యాయామాలు తప్పకుండ పాటించాలి.

 

Image result for kyabeji can control low bp

మరింత సమాచారం తెలుసుకోండి: