మధుమేహం ప్రపంచంలో రెండవ స్థానంలో ఎక్కువ మంది భాదపడుతున్న సమస్య..ఎన్నో కుటుంబాలు ఈ వ్యాధి వల్ల రోడ్డుపాలవుతున్నాయి..నవంబర్ 14 న ప్రపంచ మధుమేహ దినోత్సవం..మధుమేహం భారి నుంచీ ప్రపంచాన్ని కాపాడాలని ఎంతో కృషిచేస్తున్న శాస్త్రవేత్తలు మధుమేహ రోగులకి ఈరోజున ఒక తీపి కబురు అందించారు.

 diabetes diet కోసం చిత్ర ఫలితం

మధుమేహంలో టైపు 2 ని ఆపలేము నియంత్రణ మాత్రమే చేయగలం అనే అపోహ నుంచీ అందరు బయటకి రండి..దీనిని మనం నియంత్రించవచ్చు అంటూ ఇంగ్లండ్‌లోని న్యూక్యాసిల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు..అయితే మీరు కటినమైన నిభందనలు పాటించాలి..తక్కువ కేలరీస్ ఉన్న ఆహారాన్ని తినడం ప్రారంభించాలి.సుమారు ప్రతీ వ్యక్తీ రోజుకి 1600-3000 కేలరీలున్న ఆహారాన్ని తీసుకుంటున్నాడు..కానీ ఆ పద్దతిని మానుకుని 500-800 వరకు కుదించి చుడండి మీకు తప్పకుండ మార్పు కనిపిస్తుంది అని చెప్తున్నారు.ఎందుకంటే తక్కువగా తీసుకునే ఆహారంలో లాక్టేట్‌, అమైనో ఆమ్లాలు గ్లూకోజ్‌గా మారకుండా అడ్డుకుని, రక్తంలో గ్లూకోజ్‌ గాఢతను తగ్గిస్తుందని, తద్వారా మధుమేహానికి  చెక్‌ పెట్టవచ్చని చెప్తున్నారు.

 

అంతేకాదు మితంగా తక్కువ కేలరీస్ ఉన్న ఆహరం తింటూఉంటే బరువుకూడా తగ్గుతారు.ఇలా చేయడం వాళ్ళ వేగంగా వ్యాధి నిర్మూలన జరుగుతుంది. ఆహరం తినేపద్దతిలో మార్పు ఒక్కటి మాత్రమే సరిపోదు..దానికి తగ్గట్టుగా వ్యాయామం తప్పని సరి.అయితే ఇటువంటి పనులు మీరు సొంతంగా చేసేదానికంటే కూడా ఒక నిపుణుల సహకారంతో చేయడం చాలా ఉత్తమం.ఇదే ప్రయోగాన్ని ఎలుకలపై చేసినప్పుడు..వాటిలో కొవ్వు శాతం తగ్గి కలేయంపై చెక్కర ఉత్పత్తి తగ్గిందని తేలిందట..ఇదే మనుషులలో కూడా జరిగితే..ఈ ప్రయోగం ప్రపంచంలో అనేకమందికి ఉపయోగపడుతుంది.ఎంతో మందిని మరింతకాలం బ్రతికేలా చేస్తుంది.

diabetes diet కోసం చిత్ర ఫలితం

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: