పసుపు ఇది మనదేశంలో ఎంతో గొప్ప ఔషదం..ఇది మనదేశానికి ప్రక్రుతి ఇచ్చిన వరం అనే చెప్పాలి..ఎందుకంటే పూర్వం నుంచీ మన పూర్వీకులు ఎటువంటి జబ్బుల బారిన పడకుండా కాపాడుతూ వచ్చింది ఈ పసుపు..మన పూర్వీకులు నిత్యం ఎటువంటి పని చేసినా పసుపుని అనుసంధానం చేసి వాడేవారు...మన భారతీయులు వాడినంతగా పసుపుని మరెవ్వరు వాడరు..అందుకే మనలోయాంటిఆక్సిడెంట్ లేవిల్స్ ఎక్కువగా ఉంటాయి..అయితే పాశ్చాత్య పోకడలకి పోయి మనం ఆరోగ్యకరమైన విషయాలని వదిలేసి ఆర్టిఫిషియల్ విషయాలవైపే మొగ్గు చూపడం వలన మనల్ని అనేకరకాల అనారోగ్య సమస్యలు భాదిస్తున్నాయి..వీటికి చెక్ పెట్టడానికి మీరు పసుపు “టీ” ని రోజు కనుకా వాడినట్లయితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

 turmeric tea కోసం చిత్ర ఫలితం

పసుపు “టీ” ఎలా చేయాలో తెలుసుకుందాం

 రెండు కప్పుల నీటిని తీసుకోని..దానిని వేడి చేయాలి..ఆ తరువాత వేడి నీటిని ఒక గిన్నెలో పోసి ఒక పసుపు కొమ్ముని తీసుకుని దానిని తురిమీ లేదా మంచి పసుపు దొరికితే దానిని తీసుకుని..ఆ నీటిలో వేయాలి...వేడి నీటిలో పసుపు వేసిన తర్వార గిన్నెపై మూత మూసి 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించండి...కాసేపటి తరువాత ఆ నీటిని ఒక గ్లాసులోకి పోసి..ఈ మిశ్రమంలో ఒక స్పూన్ తేనే ,చిటికెడు మిరియాల పొడి కలిపి ఇంకొంచం సేపు మరిగించి రెండు నిమిషాల తరువాత దానిని ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం అల్పాహారం చేసే ముందు త్రాగి ఒక అరగంట తరువాత  ఏదైనా తినడం మంచిది. ఇలా చేయడం వల్ల కలిగే లాభాలు అనేకం ఉన్నాయి అవి ఏమిటి అంటే.

 సంబంధిత చిత్రం

పసుపులో ఉండే ఒక ముఖ్యమైన గుణం ఏమిటి అంటే క్యాన్సర్ బారిన పడకుండా..సమస్యని పరిష్కరిస్తుంది.దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్..యాంటీ ఇన్ల్ఫమేటరీ..యాంటీ ఫంగల్..యాంటీ వైరల్..యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పసుపులో ఉంటాయి. ఈ ఔషధ గుణాలన్నీ.. రకరకాల అనారోగ్య సమస్యలు నివారించడానికి ముఖ్యమైనవి. అలాగే పసుపులో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్స్ బి..సి..ఈ..కే..ఐరన్.. క్యాల్షియం..ఫైబర్..మెగ్నీషియం ఉంటాయి.

సాధారణంగా మన శరీరంలో పొత్తి కడుపులో కానీ..పొట్ట లోపల భాగాగంలో గానీ నులినెప్పిలా ఒక్కోసారి వస్తూ ఉంటుంది..అలాంటి వాళ్లకి న్యాచ్యురల్ గా వచ్చే నెప్పులకి నివారణం ఇస్తుంది. బరువు తగ్గాలని భావించేవాళ్లకు పసుపు టీ చాలా సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్క్యూమిన్ బరువు తగ్గడానికి సహాయపడి..ఒబేసిటిని అరికడుతుంది.పసుపులో ఉండే కర్క్యూమిన్ యాంటీ ఇన్ల్ఫమేటరీగా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఇంటెస్టినల్ పెయిన్ ని, డ్యామేజ్ ని తగ్గిస్తుంది...పసుపులో ఉండే కర్క్యూమిన్ లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ వైబ్యాక్టీరియల్ గుణాలుంటాయి.ఇది ఇమ్యునిటీ పెరగడానికి సహాయపడుతుంది. ఇది రకరకాల ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది.      

turmeric tea reduce cancer కోసం చిత్ర ఫలితం

 


మరింత సమాచారం తెలుసుకోండి: