పాలు బెల్లం రెండు ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకవిలువలు ఉన్న పదార్దాలే..ముందు నుంచీ కూడా మన పూర్వీకులు బెల్లాన్ని మాత్రమే వాడుతూ వచ్చారు..పంచదార ఏ మాత్రం మనకి అందుబాటులో లేదు..బెల్లంలో ఉండే పోషక విలువలు పంచదారలో ఉండవు. అంతేకాదు..బెల్లం చలి కాలంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది..బెల్లాన్ని నేరుగా ఎక్కువగా తినలేము కాబట్టి పాలలో కలుపుకుని త్రాగటం మంచిది.వీటి వల్ల కలిగే ప్రయోజనాలని తెలిసుకుందాం.

 Image result for jaggery

వేడి పాలలో బెల్లం వేసుకుని త్రాగితే బరువు తగ్గుతారు..ఎలా అంటే బెల్లంలో ఉండే కొన్ని రకాల ఔషద గుణాలు శరీరంలో పేరుకుని పోయిన కొవ్వుని కరిగించడంలో ఉపయోగపడతాయి..నిత్యం వీటిని త్రాగడం వలన బరువు క్రమేపి తగ్గుతూ ఉంటుంది. అంతేకాదు ఈ బెల్లం పాల మిశ్రమాన్ని త్రాగితే జుట్టు ఊదిపోకుండా ఉంటుంది..ఎంతో కాంతివంతముగా మెరుస్తుంది..స్త్రీలలో వచ్చే రుతు క్రమంలో ఉండే వివిధ రకాల సమస్యలకి పరిష్కారం చూపుతుంది..కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది..


 

అంతేకాదు చాలా మందికి ఉన్న స‌మ‌స్య ర‌క్త హీన‌త‌. దీనివలన శరీరంలో రక్తం సరఫరా సరిగా ఉండదు..అన్ని అవయవాలు సరిగా పనిచేయాలి అంటే తప్పకుండ రక్తం అధికంగా ఉండాలి..అయితే ఈ బెల్లం పాలు కలిపినా మిశ్రమాన్ని త్రాగడం వలన రక్త హీనత తగ్గుతుంది. అయితే ఈ రక్త హీనత సమస్య ఎక్కువగా మహిళలో ఉంటుంది..కాబట్టి వారు ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
Image result for jaggery milk benefits

 

కీళ్ళ నెప్పులకి సహజసిద్ద పరిష్కారం దొరుకుతుంది.ఎముకలు కూడా చాలా ధృడంగా తయాతవుతాయి.ఎముకులలో ఉండే మూలుగ చక్కగా తయారవుతుంది..జీర్ణాశయం మీద దీని ప్రభావం చాలా బాగా పని చేస్తుంది అసిడిటీ ,మలబద్దకం..అజీర్ణం..వంటి ఇబ్బందులు కూడా తొలిగిపోతాయి..


అసలు ఇన్ని రకాల ప్రయోజనాలు పొందటానికి కారణం వీటిలో ఉండే యాంటీ బయోటిక్, యాంటి వైరల్ గుణాలు మాత్రమే.ఇవి శరీరానికి అదనపు శక్తిని ఇస్తాయి..నిత్యం క్రిములపై పోరాడే మన శరీరానికి అధిక శక్తిని అందచేయడంలో ఈ బెల్లం పాలు మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.శ్వాస కొశ సంభందిత వ్యాధుల నుంచీ కూడా ఉపసమనం కలుగుతుంది.
Image result for jaggery milk benefits
 

 


 


మరింత సమాచారం తెలుసుకోండి: