సాధారణంగా శీతాకాలం ప్రవేశించగానే సీజనల్ ఛేంజ్ తో ప్రతి ఒక్కరినీ బాధ పెట్టే సమస్య పొడి దగ్గు. మనం తీసుకునే శ్వాసకు ఇబ్బంది కలిగినప్పుడు దగ్గొస్తూ ఉంటుంది. పిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దగ్గుతో సతమతమవుతూ ఉంటారు ఇప్పుడు. వాతావరణం మార్పులవలన మనం పిల్చే గాలిలో ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి కారణంగా మన శరీరంలో ఇన్ఫెక్షన్లు మొదలై చల్లని పానీయాలు తాగడం వల్ల దగ్గు వస్తూ ఉంటుంది.
Image result for cold problems
దగ్గు తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలను ఫాలో అవుతాం. అయితే దగ్గులని మన ఇంట్లో ఉండే దినుసులతో ఎలా నివరించుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం.

చిట్కా 1: దీనికి కావాల్సింది పసుపు, తేనె. పసుపులో ఉండే కార్టూమాన్స్ అనే గుణాలు దగ్గుని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణలు అధికంగా ఉన్నాయి. పసుపులో ఉన్న యాంటీ ఇంఫ్లమెటరీ గుణాలు చెస్ట్ లో ఉన్న ఇన్ఫెక్షన్ ని, ఇబ్బందిని తగ్గించడంలో యంతగానో సహాయపడతాయి. కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా తేనె ఈ రెండు బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇది దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Image result for cold problems

చిట్కా 2: దీనికి కావల్సింది తేనె, సొంటి పౌడర్. సొంటి పౌడర్ కొద్దిగా తేనె ఈ మిశ్రమాన్ని రెగులర్ గా తీసుకోవాలి. పొడి దగ్గు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.


చిట్కా 3: దీనికి కావాల్సిన పదార్థాలు మిరియాల పొడి, గోరువెచ్చని పాలు. గోరువెచ్చని పాలల్లో కొద్దిగా మిరియాల పొడిని వేసుకోండి. గోరువెచ్చని పాలల్లో మిరియాల పొడి వేసుకొని కలుపుకుని తాగడం వలన దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.


చిట్కా 4: దీనికి కావల్సింది కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు. ఇప్పుడు మనం అల్లం టీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నీళ్ళు పోయాలి. కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను నీళ్లలో వేసి బాగా మరిగించాలి. నీళ్లు ఇంకా బాగా బాయిల్ ఐయ్యి సగం అయ్యేవరుకు స్టవ్ పై ఉంచాలి. ఎందుకంటే మనం ఇది అల్లం టీ చేసుకుంటున్నాం కదా.

ఇప్పుడు అల్లం టీ బాగా మసిలిపోయింది. అల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్నీ కూడా నీళ్లలో కలిసిపోయాయి. సో కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లర్పెట్టుకొని దీన్ని ఒక గ్లాసులోకి తీసుకుందాం. రోజూ పొడి దగ్గుతో బాధపడేవారు ఈ అల్లం టీ ని రెండు నుంచి మూడు సార్లు తీసుకోడం వలన దగ్గుని తగ్గించుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: