పాలు తాగితే ఎంతో బలం అంటూ చిన్నప్పటి నుంచీ అమ్మ మనకి పాలు పట్టిస్తూ ఉంటుంది..అదే అలవాటు మనకి క్రేమేపి జీవితాంతం కొనసాగుతుంది..అయితే తాజా పరిశోధనలు ప్రకారం పాలు మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గించేస్తాయని తెలుపుతోంది..అంతేకాదు మానవ శరీరంలో వచ్చే అనేక రకాలైన మార్పులకి జబ్బులకి మూలం ఈ పాలు అనేది ఎంతో మంది చెప్తున్నారు..దీనిపై పరిశోధనలు చేసిన నిపుణులు వచ్చిన రిపోర్ట్స్ చూసి ఆశ్చర్యపోయారట..వివరాలలోకి వెళ్తే..

 Image result for milk is not good for you

పాలలో ఎన్నో పోషక పదార్ధాలు ఉండాలి కానీ ఆ పోషకాల స్థానంలో ఎన్నో అనారోగ్య కారక పదార్ధాలు ఉంటున్నాయి అని.. న్యూఢిల్లీలోని ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్లో ఐవీఎఫ్ చీఫ్‌గా పని చేస్తోన్న డాక్టర్ అరవింద్ తెలిపారు..అయితే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రోడక్ట్ తక్కువగా ఉంటే కల్తీ అనేది తప్పకుండ జరుగుతుంది..ఇదే సూత్రం దేశంలో చాలా మంది పాటిస్తున్నారు..డబ్బులకి కక్కుర్తి పడి దేశంలో ఉన్న ఎంతో మంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు..పశువులకు స్టెరాయిడ్లను ఎక్కించడం వలన ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయి అని తెలుస్తోంది..ఇదే ఎన్నో జబ్బులకి నిలయం అవుతోంది..
Image result for cow injected with hormones
ఆవు పాలివ్వడం కోసం ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్ ఇంజెక్షన్లను ఆవులు, గేదేలకు ఇస్తున్నారు. ఈ హార్మోన్ వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తడంతోపాటు లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని సంతాన సాఫల్య నిపుణులు చెబుతున్నారు..ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ పాలు లేదా ఇతర పాల ఉత్పత్తుల ద్వారా మనిషి శరీరంలోకి చేరుతుంది. ఇది సైడ్ ఎఫెక్ట్స్ కారణం అవుతోంది..అమ్మాయిలు త్వరగా యుక్త వయసులోకి రావడానికి..హార్మోన్ల అసమతుల్యత కారణంగా మగాళ్లలో వక్షోజాలు ఏర్పడటానికి ఇది కారణం అవుతోందని నిపుణులు స్పష్టం చేశారు..

 Image result for cow milk hormones effects

 

మగవారికి వయసు పెరిగే కొద్దీ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండటం అవసరం..అయితే మోతాదు ఎక్కువయితే వీర్య కణాల చలనం..ఉత్పత్తి ప్రభావం పడుతుంది. అది క్రమంగా లైంగిక పటుత్వానికి దారి తీస్తుంది..ఇలాంటి పాలని త్రాగడం వలన

Related image

అబార్షన్‌కు..పుట్టబోయే పిల్లలో లోపాలకు కారణం అవుతోందని చెబుతున్నారు. ఒక్క ఆక్సిటోసిన్ మాత్రమే కాకుండా ప్రొలాక్టిన్, ల్యూటినైజింగ్, ప్రోజెస్టిరాన్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్లతోపాటు గ్రోత్, టీఎస్‌హెచ్ లాంటివి కూడా హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతున్నాయి. మన దేశంలో వినియోగించే పాలలో 70 శాతం బిస్ఫినాల్ ఏ (బీపీఏ)తో కూడిన పాస్టిక్ బ్యాగుల్లోనే జరుగుతోంది. బిస్ఫినాల్ ఎస్, బిస్ఫినాల్ ఏ వల్ల స్త్రీ, పురుషుల్లో వ్యంధత్వ సమస్యలు తలెత్తుతాయి..ఇదే విషయాన్ని కొన్ని సంవత్సరాలకి ముందే అమెరికాకు చెందిన మైకేల్ గ్రెగర్ ఎప్పుడో తెలియచేశారు..కల్తీ చేసిన పాలు ఎలా హాని చేస్తాయో స్వచమైన పాలు కూడా గుండె సంభందిత వ్యాదులకి మూల కారణం అని తేల్చి చెప్పారు..ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఎంతో మంది గుండె పోటుతో మరణిస్తున్నారు అంటే దానికి కారణం పాల పదార్ధాలు అని  మైకేల్ గ్రెగర్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: