కడుపులో మంట..ఏదన్నా తిందాం అన్నా సరే కడుపు నిండినట్టు అనిపించడం..కొంచం అన్నం తింటే చాలు కడుపు నిండి పోయినట్టు అనిపించడం ఇలా రకరకాలుగా ఉంటుంది అదే సమస్యకి ఉపసమనం పొందకుండా ఉంటే కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం కూడా జరుగుతుంది  ఒక్కో సారి..

 Image result for gastric problems

అయితే ఈ కాలంలో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం… వయసుతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న ఆరోగ్య సమస్య, ఏ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా మానవ శరీరంలోకి ప్రవేశించి.. జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తుంది. చిన్న సమస్యలానే  అనిపిస్తుంది కానీ దీని తీవ్రత అనుభవిస్తే కానీ తెలియదు. ఒక్కసారి ఆ సమస్య వచ్చింది అంటే  పట్టుకుందంటే వదలనే వదలదు. ఇలాంటి ప్రమాదకరమైన సమస్య గురించి అవగాహన ఉండటం ఎంతో అవసరం మరి  

 

అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రధానంగా కనపడే మొదటి లక్షణం భోజనం చేసిన వెంటనే విపరీతయమైన చాతీ మంట వస్తుంది...అటూ, ఇటూ కుములుకునేలా చేస్తుంది. ఇదే కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ని బయటపెట్టే మరికొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి  కడుపు ఉబ్బటం, త్రేన్పులు, నోటి దుర్వాసన, నోటి పూత, కడుపులో నొప్పి,  మూత్రణాళం సమస్య ఇవన్నీ తరచుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు 

 Image result for gastric problems

ఈ సమస్య రావడానికి ఉన్న ప్రధానమైన కారణం మంచి ఆహారం తీసుకోక పోవడమే అంటున్నారు వైద్యులు..అయితే సరైనా ఆహరం తీసుకున్నా సరైనా సమయంలోగా తీసుకోవాలి అలా చేయకపోయినా సరే ఈ సమస్య ఎదురవుతుంది..అంతేకాదు తరచుగా ఆల్కాహాల్ తీసుకునే వాళ్లకి ఈ సమస్య రావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, జంక్ ఫుడ్ మరియూ, కారాలు ఎక్కువగా ఉండే స్పైసీ ఫుడ్ తీసుకోవటం కూడా ప్రమాదకరం  

 

ఒక్కోసారి పడుకున్నప్పుడు అనుకోకుండా గ్యాస్ సమస్య వస్తుంది ఆ సమయలో

 Image result for gastric problems

 ఒక గ్లాసు వేడి నీరు తాగటం ఎంతో ఉత్తమం..అంతేకాదు..నమ్మ రసాన్ని వాడటం..లేదా గ్లాసు మూలికా “టీ” త్రాగడం చేయాలి.. అన్నిటి కన్నా శ్రేష్టమైనది మంచినీళ్ళు త్రాగడం..దీనికి మించిన మెడిసిన్ లేదు అనే చెప్పాలి.. 

 

 వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలుకలు..కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోవటం ..మజ్జిగ ఎక్కువగా తాగటం కొత్తిమీరని ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉపయోగించటం అప్పుడప్పుడూ సోపు గింజలు నములుతుండటం చేయాలి..సోపు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: