ఆడవారు అందంగా కనిపించడాని ఎన్నో పద్దతులు పాటిస్తుంటారు.  కొంత మంది బ్యూటీ పార్లను ఫాలో అయితే..కొంత మంది నేచురల్ గా అందంగా తయారు అవుతుంటారు. ఇక ముఖంపై మచ్చల వల్ల ముఖం, చేతులు  అసహ్యంగా కనిపిస్తున్నాయా?  ఈ సమస్యను వంటింట్లో తయారుచేసుకునే ఫేస్‌ ప్యాక్‌లతో ఇట్టే పరిష్కరించుకోవచ్చు.  

Image result for skin toning

నిమ్మకాయ, దోసకాయ, రోజ్‌ వాటర్‌లతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. నిమ్మకాయ నేచురల్‌ బ్లీచ్‌గా పనిచేస్తుంది. దోసకాయ, రోజ్‌వాటర్‌లు కూలింగ్‌ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఒక చిన్న గిన్నెలో   టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం, టేబుల్‌స్పూన్‌ దోసకాయ రసం, రోజ్‌వాటర్‌లు పోసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని టాన్డ్‌ స్కిన్‌ మీద దూదితో   రాసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి.  ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం  కడుక్కోవాలి. ప్రతి రోజూ బయట నుంచి ఇంటికి  వచ్చాక ఈ మిశ్రమాన్ని  రాసుకుంటే చర్మపై ఉన్న టానింగ్‌ పోతుంది. 

Image result for skin toning

సెనగపిండి, పసుపు వాడడం వల్ల కూడా టానింగ్‌ సమస్యను అధిగమించవచ్చు. రెండు టేబుల్‌ స్పూన్ల సెనగపిండిలో కొద్దిగా పసుపు,   టేబుల్‌ స్పూను పాలు,    కమలాపండు తొక్కల పొడి  గిన్నెలో వేసి పేస్టులా చేయాలి. అందులో రోజ్‌వాటర్‌   కూడా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖాన్ని, చేతులను బాగా కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై టానింగ్‌ మెల్లగా పోతుంది. 

Image result for skin toning

ముఖానికి మజ్జిగ రాసుకుంటే చర్మం నునుపుదేలుతుంది. ఓట్‌మీల్‌ నేచురల్‌ స్క్రబ్బర్‌లా పనిచేస్తుంది. ఒక చిన్న గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్‌మీల్‌, నాలుగు టేబుల్‌స్పూన్ల మజ్జిగ పోసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని టానింగ్‌ ఉన్న చోట రాసి మెల్లగా మసాజ్‌ చేయాలి. ఒక పదిహేను నిమిషాలు దానిని అలాగే ఉంచి ఆ తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేసుకోవాలి. 


పాలు, స్ట్రాబెర్రీ కలిపిన మిశ్రమం కూడా చర్మంపైనున్న టానింగ్‌ సమస్యను తగ్గిస్తుంది.   చర్మాన్ని మెరిసేట్టు చేస్తుంది. అంతేకాదు చర్మంపై ఉన్న పిగ్మెంటేషన్‌, నల్లమచ్చలు లాంటివి  పోతాయి. అందుకే స్ట్రాబెర్రీలను బాగా మెత్తగా చేసి అందులో రెండు టేబుల్‌ స్పూన్ల పాలమీగడ కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి. ముఖం మీద చర్మం మెరిసిపోవడమే కాదు ఎంతో తాజాగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: