*  ధనియాల లేత మొక్కలని మనం కొత్తిమీర అంటాము . 

*  వీటియొక్క రుచి కారంగా మరియు వాసన సుగంధభరితంగా ఉండును. 

 *  కొత్తిమీర గాఢ కషాయంలో పాలు మరియు పంచదార కలిపి ఇస్తే నెత్తురు పడే మూలశంఖ అనగా రక్తంతో కూడిన మొలల వ్యాధి , అజీర్ణ విరేచనాలు , జఠరాగ్ని తగ్గుట , కడుపులో గ్యాస్ సమస్య వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది . 

 *  కొత్తిమీర శరీరంలో మూడు దోషాల పైన పనిచేస్తుంది . విదాహాన్ని అనగా దాహం ఎక్కువ అయ్యే సమస్యని పోగొడుతుంది . భ్రమ ని తగ్గిస్తుంది . కొత్తిమీర మంచి జీర్ణకారి.

 * కొత్తిమీర రసాన్ని చనుపాలతో కలిపి కళ్లలో వేస్తే నేత్రరోగాలు నయం అవుతాయి.లేదా కొత్తిమీర వెచ్చచేసి కళ్ళకి వేసి కట్టినా సమస్య తీరును .

 *  కొత్తిమీర కషాయంలో పంచదార కలిపి పుచ్చుకుంటే బాగా ఆకలి పుట్టిస్తుంది.

 *  ప్రాచీన కాలంలో కొన్ని తెగలవారు ప్రసవించే స్త్రీ దగ్గర ఈ కొత్తిమీర ఉంచితే వారు తొందరగా ప్రసవిస్తారు అని ఒక నమ్మకం ఉండేది. ప్రసవింవించిన వెంటనే అక్కడ నుంచి కొత్తిమీర తీసివేయవలెను.

 *  నోరు పూసి ఉన్నప్పుడు కొత్తిమీర రసంతో పుక్కిలిస్తే అద్భుతంగా పనిచేయును . 
 
*  ఈ కూర వండుకుని తినటం మరియు దీనిని కూరల్లో వాడటం వలన మూత్రాన్ని బాగా జారీచేస్తుంది.

 *  దీనిని తరచుగా తీసుకోవడం వలన మెదడులో వేడిని అణుచును.

 *  దీని ఆకు అవునేయ్యితో వేయించి కొంచం కనురెప్పలు మూసుకొని కనులపై వేసి కట్టిన నేత్రసమస్యలు నివారణ అగును.
 
కొత్తిమీర కారం తయారీ విధానం : 
కొత్తిమీర ఆకులని , పచ్చిమిరపకాయలని తొక్కి తగినంత ఉప్పువేసి అందులో నిమ్మకాయ రసం చేర్చి చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.   దీనిని తీసుకోవడం వలన శరీరంలో పైత్యం తగ్గును.

 గమనిక :  గ్రహణి రోగం తో భాధపడేవారు ఈ కొత్తిమీరని ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు.
 
గంగపాయల కూర :

 *  ఇది చూడటానికి ఎర్రని కాడలతో గలిజేరుని పోలి ఉంటుంది. నేలమీద పాకుతుంది. కాడలు , ఆకులు మందంగా ఉంటాయి. ఇది పసుపుపచ్చని పూలు పూస్తుంది.

 *  దీని రుచి పుల్లగా ఉంటుంది. ఇది సులభంగా పెరుగును . 

 *  ఇది పాలకంటే మరియు వెన్నకంటే మంచిది .

 *  దీనిలో A ,B విటమినులు బాగా ఉన్నాయి .పాలకంటే , వెన్నకంటే కూడా జీవశక్తి అధికంగా ఉన్నది అని తమిళనాడు ప్రభుత్వ పరిశోధనలో తేలింది . అదేవిధంగా రోగనిరోధక శక్తి అధికంగా ఉండును అని కూడా పరిశోధనలో తెలిసింది.

 *  ఈ కూరలో ఐరన్ ,  కాల్షియం ఎక్కువుగా ఉన్నాయి. A విటమిన్ ఎక్కువ , B ,C D విటమినులు కొద్దిగా ఉన్నాయి.

 *  రక్తహీనత వ్యాధి కలవారు దీనిని తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు పొందగలరు.

 *  శరీరంలో దుష్ట పదార్థాలను తొలిగించి బయటకి పంపడంలో దీనిని మించింది లేదు .

 *  మన శరీర ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలి అంటే " క్షారశిల " అను మూల పదార్థం కావాలి ఈ పదార్థం గంగపాయల కూరతో దేహములోకి చేరును . ఎముకలు మరియు దంతాల పెరుగుదల కొరకు అది అత్యంత అవసరం.

*  సంగ్రహణి , కుష్టు , మూత్రాశయం లో రాయి వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు  ఈ కూరని ఆహారం లో బాగం చేసుకోవాలి .
 
*  వెంట్రుకలకు బలాన్ని ఇచ్చును.

 *  రక్తం కక్కుకునే వ్యాధి వారికి మంచి ఔషధం గా పనిచేయును .  ఈ కూరని తప్పకుండా మన ఆహార పదార్థంలో బాగం చేసుకోవలెను . 
 
గమనిక   :   ఈ ఆకుకూరని పారేనీటిలో కడగడం ఉత్తమమైన పని. ఇది నేల మీద పాకును కావున ఇసుక , మట్టి ఎక్కువుగా ఉండును. కావున జాగ్రత్తగా శుభ్రపరుచుకోవాలి 
             దీనిని మరీ అతిగా తినరాదు. ఎందుకంటే ఇది చలువచెసే గుణం కలిగినది.కావున ఎక్కువ తిన్నచో శరీరంలో శ్లేష్మమును పెంచును. కండ్లకు మరియు మూత్రపిండముల పై , తలలో నరములపై కొంచం ప్రభావం చూపించును. కావున 10 రోజులకు ఒకసారి తిన్నచో చాలును.


మరింత సమాచారం తెలుసుకోండి: