మెంతులు తినడానికి చేదుగా ఉన్నా చెక్క సువాసనను కలిగి ఉంటాయి. ఇవి వేసవి సీజన్‌లో ఆరోగ్యానికి చాలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. కప్పు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడిని వేసి 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. మెంతి పొడిని వడబోసి ఆ మిశ్రమాన్ని తాగడం వల్ల క్రమంగా స్థూలకాయ సమస్య తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. 

Image result for మెంతి పొడిని పెరుగులో

మెంతి పొడిని పెరుగులో కలిసి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం మీద ఉండే ముడతలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే అరచెంచా మెంతి పొడిని పరగడపునే వేడి నీటిలో కలిపి తీసుకుంటే స్త్రీలలో నెలసరి సమస్యలు తొలగిపోతాయి. స్త్రీలకు నెలసరి కూడా క్రమబద్ధమవుతుందట. అంతేకాకుండా ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పికూడా మటుమాయమైపోతుందట. ఒంట్లో అతిగా వేడి ఉన్న వారు తిన్న ఆహారం ఒంటపట్టక ఎండిపోయి నల్లగా మారిపోతారు.

Image result for curd

అలాంటి వారు కప్పు పెరుగులో చెంచా మెంతులను రాత్రిపూట వేసి ఉదయం వరకు నానబెట్టాలి. వీటిని పరగడుపున మెంతులతో పాటు పెరుగు కూడా తింటుంటే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. అలాగే విరోచనాలు అవుతున్నప్పుడు ఒక స్పూన్ పెరుగుకు చిటికెడు మెంతుల చొప్పున వెంట వెంటనే మూడుసార్లు తీసుకోవాలి.. అలా గంటకు ఒకసారి ఇలా చేస్తే విరేచనాలు వెంటనే తగ్గిముఖం పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: