మీరు ఆరోగ్యంగా ఉండాలని వాకింగ్ చేస్తున్నారు కదా? సంతోషం వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది నిజమే ఐతే ఇదే వాకింగ్ మీరు చెప్పులు లేకుండా చేస్తే ఎన్నో వ్యాదులు తగ్గిపోతాయి అదెలాగో చూద్దాం!
Image result for walking
మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము నకు సంభందించిన ఒత్తిడి కేంద్రాలు మన పాదాలలో చేతులలో ఉంటాయి ఈ కేంద్రాలకు ఒత్తిడి కలిగించడం వల్ల ఆ యా అవయవాలను ఉత్తేజపరచడం ద్వారా వ్యాధులను నిరోదించే వైద్య ప్రక్రియ ( పీడన వైద్యం ) మన ఆయుర్వేదంలో భాగంగా ఉన్నది దీనినే ఇప్పుడు ఆక్యు ప్రెషర్ ( పంక్చర్ ) అని పిలుస్తున్నారు మీరు చెప్పులు లేకుండా నడిచినట్లయితే మీ పాదాలకు ఒత్తిడి కలిగి ఆరోగ్య సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది.
Related image
రెండు చేతులతో 5 నిమిషాలు చప్పట్లు కొట్టడం ద్వారా కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. చెప్పులు లేకుండా రోడ్డు పైన కాకుండా రోడ్డు పక్కన మట్టిలో కాని , ఇసుకలో కాని, చిన్న చిన్న గులక రాళ్ళు లేక కంకర రాళ్ళు ఉన్న ప్రదేశంలో నడవడం వల్ల మీకు చాల ఉపయోగం ఉంటుంది. ఉదయం సాయంత్రం 5 నిమిషాలపాటు కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టండి, మన పూర్వీకులు అందుకే గుడిలో భజన చేసేవారు.
Image result for walking india
వెంటనే ఈ రెండు చిట్కాలు పాటించండి 3 లేక 4 రోజుల్లో మీ శరీరం తేలికపడి, కాళ్ళ నొప్పులు ఒంటి నొప్పులు తగ్గి మంచి నిద్ర పడుతుంది 10 రోజుల పాటు పాటించండి మీ అనారోగ్య సమస్యలు అన్ని తగ్గుముఖం పట్టడం మీరు గమనిస్తారు ఆ పైన మీరే కొనసాగిస్తారు.మధుమేహ బాదితులు మాత్రం కాళ్ళకు గాయాలు కాకుండా జాగ్రత్తగా నడవడం మరచిపోవద్దు.


మరింత సమాచారం తెలుసుకోండి: