పులిపిర్లు ఒక విధమైన వైరల్ ఇన్ఫెక్షన్ వలన వhస్తాయి. అయితే వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన ప్రతివారిలోనూ వస్తాయని చెప్పలేం. కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి లోనై రోగనిరోధక శక్తి లోపించినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే పులిపిర్లు వస్తాయి. సాధారణంగా పులిపిర్లతో ఏ సమస్య ఉండదు కాని కొన్నిసార్లు నొప్పి, దురద, రక్తం కారటం వంటి ఇబ్బందులు ఉండవచ్చు. పులిపిర్లను కత్తిరించటం, కాల్చటం వలన మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్ మెడికేషన్ ద్వారానే పులిపిర్లను పూర్తిగా తగ్గించటం మంచిది.

Image result for pulipirlu

పులిపిర్లు చర్మంలో ఏ భాగంలోనైనా రావచ్చు. వీటి సంఖ్య, పరిమాణాన్ని బట్టి చికిత్స చేస్తుంటారు. చాలా వరకు పుటిపిర్లు చిన్న చిన్న పొక్కులగా చర్మం రంగులో కలిసి పెరుగుతుంటాయి. ఒక్కోసారి నొప్పి, అసౌకర్యంగా కూడా కలుగుతుంది. వీటికి స్పర్శ కూడా తక్కువే. ఇవి సాధారణంగా ఒరిపిడికి గురయ్యే చోట ఎక్కువగా పెరుగుతాయి. ఈ సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎక్కువ. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు ఇవి ఎక్కువగా ఉంటాయి..రోగనిరోధక శక్తి పెంచి, పులిపుర్లు మాడిపోవడానికి కొన్ని చిట్కాలు...

Image result for pulipirlu

1. తరచూ మంచి నీళ్ల ఆవిరి పడితే శరీరానికి చెమటపడుతుంది. దీనివల్ల ముక్కు, ముఖంలోని కఫం కరిగి సమస్య తగ్గుతుంది. ఒక చెంచా చొప్పున అల్లం, బెల్లం కలిపి మెత్తగా నూరి రసం తీసి రాత్రి పడుకునే ముందు ఐదారు చుక్కలు ముక్కులో వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దాంతో పాటు చెంచా నీళ్లలో త్రిఫలాచూర్ణం కలిపి తీసుకోవచ్చు.

2. ముల్లంగి గింజల రసం తీసుకొని మూడు నుంచి ఆరు చుక్కలు ముక్కలో వేస్తే త్వరగా గుణం ఉంటుంది. దీనితోపాటు క్యారెట్ రసం రోజుకు రెండు టీస్పూన్ల చొప్పున తీసుకోవాలి.

3. చిన్న పులిపిర్లు ఉన్నవారు అల్లం, నీరు, సున్నం సమానంగా కలిపి మెత్తగా పేస్ట్ చేసి వాటిమీద రాస్తే అవి అరిగిపోతాయి.

4. రావి పట్టును కాల్చి మసి చేసి దానికి కొత్త సున్న కలిపి వాటిమీద లేపనంగా రాస్తే కరిగిపోయే అవకాశం ఉంటుంది.

5. రోగనిరోధక శక్తిని పెంచే క్యారెట్, నారింజ, బీట్ రూట్, ద్రాక్ష, యాపిల్, ఉసిరి వంటివి తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోదక శక్తి పెరిగి ఇలాంటివి రాకుండా చేస్తుంది.

6. పులిపిర్లు పోవాలంటే కాలిఫ్లవర్‌ రసం పూయాలి. మూడువారాలపాటు అలా చేస్తే పులిపిర్లు రాలిపోతాయి.

7. ఈ మద్య కాలంలో ఆడ మగ తేడాలేకుండా ముఖం, మెడమీద చిన్న చిన్న పులిపిర్లు ఇబ్బంది పెట్టుస్తున్నాయి. అలాంటి వారు పులిపిర్లు పోవాలంటే ప్రతిరోజూ కాలిప్లవర్ రసం, బంగాళా దుంప రసం, వెల్లుల్లిపాయ రసం క్రమంగా రాస్తుంటే పులిపుర్లు రాలిపోతాయి.

8. కొత్త సున్నం, మంచి పసుపు కలిపి రాసుకుంటే పులిపిర్లు రాలి చర్మం శుభ్రంగా ఉంటుంది.

9. పులిపిర్లు రాలిపోయిన తరువాత మచ్చపోవటానికి తేనె, నిమ్మరసం కలిపి రాయాలి.

10. కొత్తిమీర, పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు పోతాయ

మరింత సమాచారం తెలుసుకోండి: