క్యాన్సర్..ప్రపంచంవ్యాప్తంగా జబ్బుల ద్వారా మరణించే వారిలో అత్యధికంగా  గుండెజబ్బుల ద్వారా మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుదని..దాని తరువాత రెండో స్థానంలో  “క్యాన్సర్” వ్యాధి ద్వారా చనిపోయే వారి సంఖ్య ఎక్కువ ఉందని చెప్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు..అయితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది..ఎలా వస్తుంది..క్యాన్సర్ ఏర్పడటానికి కారణాలు క్షుణ్ణంగా తెలుసుకుంటే క్యాన్సర్ ముప్పు బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటున్నారు..నిపుణులు

 Image result for cancer

 “క్యాన్సర్” మానవ శరీర నిర్మాణానికి ఎంతో ముఖ్యమైన కణాలు కావాలి అయితే శరీర నిర్మాణానికి ఎలాంటి కణాలు ఉపయోగపడుతాయో అదేవిధంగా క్యాన్సర్ రావడానికి కూడా అవే కణాలు కారణం అవుతాయి..ఎలా అంటే శరీరంలో జరిగే అనేక మార్పులకి అభివృద్దికి కణాల పాత్ర కీలకం ఆ కణాలు క్రమబద్దీకరణ జరిగే క్రమంలో కొన్ని కణాలు అదుపు తప్పుతాయి మరి కొన్ని కణాలు విచ్చిన్నం అవుతాయి..మరికొన్ని పాత కణాలు క్షీణించే సమయంలో క్షీణించవు ఇలాంటి కణాలన్నీ కలిపి ఓ పెద్ద కాణంగా ఏర్పడుతాయి అభివృద్ధి చెందుతాయి దీనినే క్యాన్సర్ కణం..క్యాన్సర్ గడ్డ అంటారు..

 Image result for cancer

అయితే ఈ కణుతుల్లో రెండు రకాలు ఉంటాయి ప్రాణాంతకమైనవి మరొకటి ప్రమాదకరమైన కణితి. సాధారణ కణుతులు పెద్దగా పెరగవు ఒక సరి వారిని తీసేసినా సరే అవి మళ్లీ పెరగవు..అయితే వీటిలో ప్రాణాంతకమైన కణుతులు మాత్రం శరీరంలో ఒక చోటు నుంచీ మరో చోటుకి విస్తరిస్తాయి..రక్తాన్ని నిర్వీర్యం చేస్తుంది..శరీరంలోని అన్ని భాగాలకి తన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఇలాంటి ప్రాణాంతక కణుతులు ఏర్పడటానికి కారణాలు తెలుసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు కలుగకుండా చేసుకోవచ్చు..

 Image result for how to effect cancer

చాలా మంది జీవిత విధానంలో కలిగే మార్పులు వలన..వారి వారి అలవాట్లు వలన సాధారణంగా ఉండవలసిన కణాలు మార్పులు చెందుతాయి ఇలాంటి మార్పులకి కారణలు అనేకం ఆహరవు అలవాట్లు, ధూమపానం , మద్యపానం , వాతావరణంలో కలిగే మార్పులు , వంశపారంపర్యంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుదని అంటున్నారు వైద్యులు..అయితే క్యాన్సర్ అంటువ్యాధి మాత్రం కాదు..ఒకరి  నుంచీ ఒకరికి వ్యాప్తి చెందదు..అయితే క్యాన్సర్ ప్రాణంతకం కాదు దీన్ని మొదటి దశలో గుర్తిస్తే నివారించడం చాలా సులభం..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: