మనలో చాలామంది ఒకప్పుడు క్యాన్సర్ గురించి వినడం తప్ప దాని ద్వారా మనకు తెలిసిన వారు బాదపడడమో, చనిపోవాడమో చూడలేదు. కానీ అదిప్పుడు క్రమ క్రమంగా మారుతుంది. ఈ రోజుల్లో మనకు తెలిసిన వారు ఎవరో ఒకరు ఈ ప్రాణాంతక వ్యాదితో బాదపడుతూనే ఉన్నారు. భారతీయ ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలు కూడా అలాగే ఉన్నాయి.  క్యాన్సరు అనే వ్యాధి శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది దగ్గరి సంబంధం వున్న అనేక వ్యాధుల సముదాయం.
Image result for క్యాన్సర్ ని ఎలా కనిపెట్టాలి
దీనిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సాధారణమైన కణాలు ఎప్పుడు క్యాన్సరు కలిగించేవిగా మారుతాయో తెలుసుకోవాలి. శరీరం ఎన్నో కణాల సముదాయాలతో నిర్మిత మవుతుంది. సాధారణంగా కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి అవసరము. కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది.... శరీరానికి అవసరం లేక పోయినా క్రొత్తకణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాల సముదాయం కంతి లాగా గడ్డలాగా ఏర్పడుతాయి.
Image result for క్యాన్సర్ ని ఎలా కనిపెట్టాలి
దీనినే క్యాన్సరు గడ్డ అని, మారణ కంతి అని, రాచ కురుపు అని అంటారు. అన్ని గడ్డలు అపారకరమైనవికాదు. కొన్ని నిరపాయకరమైనవి కూడా వుంటాయి. క్యాన్సరు జబ్బులో చాలా రకాల లక్షణాలు కనబడుతాయి. ఇంత మంది చనిపోవడానికి క్యాన్సర్ రోగం మాత్రమే కారణం కాదు, ప్రజలలో ఉన్న నిర్లక్ష ధోరణి, ఆ వ్యాధిపై అవగాహన లేకపోవడం కూడా మరణాల సంఖ్య పెరగడానికి కారణం. 80% మంది క్యాన్సర్ బాదితులు ఆ జబ్బు క్రిటికల్ స్టేజ్ వచ్చేవరకు డాక్టర్ ని సంప్రదించక పోవడంతోనే మరణిస్తున్నారు అని ఒక నివేదిక వెల్లడించింది. 

Image result for క్యాన్సర్ ని ఎలా కనిపెట్టాలి

సరైన సమయంలో వ్యాధి లక్షణాలను గుర్తించి చికిత్స చేయించుకుంటే 100% ఈ వ్యాది నుండి బయటపడవచ్చని డాక్టర్ లు వెల్లడిస్తున్నారు. దయచేసి క్యాన్సర్ ని తక్కువ అంచనా వేయకుండా ఆ లక్షణాలు కనపడితే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.


కాన్సర్ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణమైన లక్షణాలు:
అల్సర్
నోటిలో గాయాలు మరియు నోటిలో రక్త స్రావం.
బొంగురు గొంతు.
దీర్ఘకాలికంగా దగ్గు మరియు దగ్గులో రక్తం రావటం.
మెడ పైన ముద్దగా అనిపించటం.
ఆహారం మింగటంలో ఇబ్బంది, తినకుండానే కడుపు నిండుగా అనిపించటం.
అజీర్తి, గుండెలో మంట, కడుపులో ఎగువ, దిగువ భాగాలకు మధ్యలో అప్పుడప్పుడు నొప్పి వస్తుంటుంది.
మలంలో రక్తం (నలుపు/ఎరుపు) పడటం, రక్తంతో కూడిన వాంతులు.
బరువు తగ్గిపోవటం, నీరసం పెరగటంతో పాటు కొన్నిసార్లు కామెర్లు.
ఈ లక్షణాలలో ఏ ఒక్క లక్షణం అయిన కాన్సర్ కి కారణం కావొచ్చు, కాన్సర్ ని ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స చేయించుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: