బాగా వెయిట్ ఉన్నవారికి, శారీరక శ్రమ లేనివారికి వైద్యులు ఇస్తున్న బెస్ట్ సజిషన్ రాత్రిపూట భోజనం మానుకోమని. మరి ఆకలి అవుతుంది కదా.. అంతేకాదు రాత్రి భోజనానికి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు మధ్య దాదాపు 8-10 గంటల లాంగ్ గ్యాప్ కూడా ఉంటుంది. ఈ రెండు అంశాలకు సరైన సమాధానమే చపాతీలు తినడం. ఈజీగా జీర్ణం కావడమే కాకుండా శక్తిని ఒక్కసారే కాకుండా కొద్ది కొద్దిగా చొప్పున కొన్ని గంటల పాటు శక్తిని విడుదల చేయడం చపాతీల ప్రత్యేకత. ఇంకా చపాతీలను తినేవారు తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలెన్నో ఉన్నాయి.

Related image

* నిద్ర పోయేప్పుడు శక్తి నామమాత్రంగానే ఖర్చవుతుంది. మనలోని క్యాలరీలు ఏమాత్రం తగ్గవు. అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాక పోవడంతో కొవ్వుగా మిగిలి పోయి, మనిషి లావు అయ్యే ప్రమాదం ఉంది.

* రాత్రి భోజనం చేసి, వెంటనే పడుకోవడం మరింత ఆరోగ్యానికి హానికరం. అందుకే రాత్రి సమయంలో భోజనంకు బదులుగా చపాతి తింటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

* ప్లేట్‌ నిండుగా భోజనం చేసినా 2, 3 చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతీలు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి.
Image result for chapati eating
* చపాతీకి ఉపయోగించే గోదుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. ఎక్కువగా విటమిన్‌ బి, ఇ, కాపర్‌, అయోడిన్‌, జింక్‌, మాంగనీస్‌, సిలికాన్‌, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి.

* గోదుమల్లో “ఐరన్‌” ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో “హిమోగ్లోబిన్‌” శాతాన్ని పెంచుతుంది.

* ఏవైనా అతి అనారోగ్యమే. అలాగే చపాతి కూడా..

* చపాతిని చాలా తక్కువ నూనేతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనే వేయకుంటే మరింత మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: