వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతూ వస్తుంది. అంతేగాక రొమ్ము క్యాన్సర్ కొన్ని కుటుంబాలలో వారి జెనెటిక్ కోడ్ మీద ఆధారపడి వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ఫ్యామిలి హిస్టరీ లేని వారికి ఈ క్యాన్సర్ రాదు అనుకోవడానికి లేదు కాబట్టి 30 ఏళ్ల నుంచే ప్రతి స్త్రీకి రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన తప్పనిసరి.  రొమ్ము గడ్డలు రొమ్ము క్యాన్సరు స్త్రీలలో వచ్చే క్యాన్సరులలో అతి సాధారణమైనవి. క్యాన్సరు వల్ల స్త్రీలలో కలిగే మరణాలలో రెండవ స్థానంలో వున్నది. స్త్రీ జీవిత కాలంలో ఈ జబ్బు వచ్చే అవకాశాలు 1 నుంచి 9 వరకు వుంటాయి.

Image result for రొమ్ము క్యాన్సర్

లక్షణాలు

  • రొమ్ములో గడ్డ
  • చనుమొనల నుంచి ద్రవాలు స్రవించడం (కారణం)
  • వెనుదిరిగిన చనుమొనలు (సాధారణంగా బయటకు వచ్చినట్టు వుండాలి.)
  • ఎఱ్ఱగా, కందినట్టుగా వుండే చనుమొనలు
  • రొమ్ములు పెద్దవిగా అయివుండడం.
  • రొమ్ములు కుంచించుకు పోయినట్టు వుండడం.
  • రొమ్ములు గట్టిపడడం
  • ఎముకలలో నొప్పి
  • నడుము నొప్పి 

Image result for రొమ్ము క్యాన్సర్

హానికలిగించే  అంశాలు:

  • ముందుగా రొమ్ములకు సంబంధించిన జబ్బులు వచ్చి ఉండడం, రొమ్ములలో అసాధారణ మార్పులు వచ్చి వుండడం.
  • జన్యు పరమైన లోపాలు లేదా మార్పులు (అరుదైన మార్పులు)
  • 50సం,, దాటిన తరువాత బహిష్టులు ఆగిపోవడం (కొద్దిగా ఆలస్యంగా)
  • పిల్లలు కలుగక పోవడం
  • మధుపానం, ఆహారంలో ఎక్కువ క్రొవ్వు పదార్థాలు తీసుకోవడం, పీచు పదార్థాలు ఎక్కువగా వున్న ఆహారం తీసుకోవడం, ధూమపానం, అధిక బరువు, ముందుగా వున్న అండాశయ క్యాన్సరు, పెద్ద పేగుల క్యాన్సరు.
  • కుటుంబ చరిత్ర, ముఖ్యంగా దగ్గరి బందువులలో ఈ వ్యాధి వుండడం.
  • స్త్రీల వయసు పెరిగే కొద్దీ వ్యాధి వచ్చే అపాయం పెరుగుతూ పోతుంది.
  • ముందుగా గర్భాశయం క్యాన్సరు వచ్చివున్న చరిత్ర

Image result for రొమ్ము క్యాన్సర్

రొమ్ము క్యాన్సరు యొక్క చికిత్స ముఖ్యంగా మూడు అంశాలపై ఆధారపడి వుంటుంది.

  • చికిత్స తీసుకునే స్త్రీ బహిస్టులు ఎండిపోయే వయసుకు చేరుకొని వున్నదా
  • రొమ్ము క్యాన్సరు ఎంత మేరకు వ్యాపించి ఉన్నది
  • రొమ్ము క్యాన్సరు లోని కణాల నమూనా (రకం)

రొమ్ము క్యాన్సరు యొక్క వ్యాప్తి హార్టులు క్రింది విధంగా నిర్వచించబడుతాయి.

  • మెదడు మరియు ఎముకలు మొ,, ఇతర అవయవాలకు క్యాన్సరు వ్యాపించడం.
  • రొమ్ము క్యాన్సరు కణాలలో కూడా రకాలు వుండవచ్చును.
  • త్వరితగతిని విభజన చెందే కణాలు కొద్దిగా తక్కువ వేగంతో విభజన చెందే కణాలు దీనికి తోడు కణాలపై గ్రాహకాలు వుంటాయి. దీవి ఉనికి రొమ్ము క్యాన్సరు చికిత్సకు ప్రతిస్పందన అధికం చేస్తుంది.
  • రొమ్ములో ఏ స్థానంలో ఏర్పడి వున్నది
  • క్యాన్సరు ఏ వంతున శోష గ్రంధులలోకి వ్యాపించి ఉన్నది.
  • రొమ్ము లోపలి లోతుగా వున్న కండరాలలోనికి క్యాన్సరు వ్యాపించడం

నివారణోపాయాలు

  • ప్రతినెలా రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవడం
  • సంవత్సరానికి ఒకసారి వైద్యనిపుణులతో రొమ్ముల పరీక్ష
  • పౌష్ఠికాహాకారాన్ని తీసుకోవడం
  • రొమ్ములో గడ్డలు (చిన్నవికానీ, పెద్దవికానీ) వున్నట్టు ఎంత మాత్రం అనుమానం కలిగినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
  • రొమ్ము క్యాన్సరు త్వరగా కనుక్కొని చికిత్స తీసుకుంటే నయం చేసుకోవచ్చు, ఆలస్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చును.


మరింత సమాచారం తెలుసుకోండి: