Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 3:46 pm IST

Menu &Sections

Search

ఎముకల క్యాన్సర్‌ లక్షణాలు..నివారణ..!

ఎముకల క్యాన్సర్‌ లక్షణాలు..నివారణ..!
ఎముకల క్యాన్సర్‌ లక్షణాలు..నివారణ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

క్యాన్సర్ రకాలలో బోన్ క్యాన్సర్ ఒక అసాధారణమైన రకం, మాలిగ్నెంట్ కణాలలో ఎముకల మధ్య నియంత్రణ రహితంగా కణాల సంఖ్య పెరగటం వలన బోన్ క్యాన్సర్ వస్తుంది. బోన్ క్యాన్సర్ లేదా ఎముకల క్యాన్సర్, ఎముకలలో ఏర్పడి వివిధ రకాల సమస్యలకు గురి చేస్తాయి. ఎముకల క్యాన్సర్(బోన్‌మ్యారో)ను తొలిదశలో గుర్తించడం ద్వారా రోగి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్ డాక్టర్ మురళీ సుందరం అన్నారు. 

bone-cancer-healthy-food-fit-and-healthy-health-ti

బోన్ క్యాన్సర్ ఉండే వారిలో శరీరంలో లంప్స్, బరువు తగ్గడం, తరచూ జ్వరం వస్తుండటం, రాత్రుల్లో చెమటలు పట్టడం, మరియు చలి వంటి లక్షణాలు కనబడుతాయి. బోన్ క్యాన్సర్ లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించినట్లైతే వెంటనే చికిత్సను అందివ్వవచ్చు. బోన్ క్యాన్సర్ వల్ల వచ్చే ప్రమాధాన్ని గుర్తించినట్లైతే వెంటనే తగ్గించుకోవచ్చు. 


ఈ రకం క్యాన్సర్ వలన ఎముకలలో క్యావిటీలు ఏర్పడి, పెలుసుదనంగా మారి, సులువుగా విరగటం మరియు అసాధారణ పెరుగుదలకు కారణమవుతాయి. బోన్ క్యాన్సర్ శరీరం మొత్తం విస్తరిస్తే మాత్రం రోగి త్వరగా మరణించే అవకాశం ఉంది.  

bone-cancer-healthy-food-fit-and-healthy-health-ti

లక్షణాలు : 

ఎముకలో నొప్పి: ఎముకని ఏదైనా భాగంలో కణితి పెరగగానే కనిపించే మొదటి లక్షణం నొప్పి. తొలుత ఈ నొప్పి రోజులోని ఏదో ఒక సమయంలో వస్తుంటుంది. క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ నొప్పి వచ్చే వ్యవధి కూడా పెరుగుతుంది. అయితే ప్రతి నొప్పినీ క్యాన్సర్‌గా భావించనవసరం లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి సాధారణ జబ్బుల్లోనూ ఎముకలూ, కీళ్లలో నొప్పులు వస్తాయి. ఇదే సమయంలో మరో విషయమూ గుర్తుంచుకోవాలి. ఒక్కోసారి ఎముకలకు వచ్చే కణుతులను ఆటల్లో తగిలిన గాయాలుగా పొరబడే అవకాశమూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా పరీక్ష చేయించుకుని, క్యాన్సర్ కాదని నిర్ధారణ అయితే నిశ్చింతగా ఉండాలి.

bone-cancer-healthy-food-fit-and-healthy-health-ti

వాపు : ఎముకలో నొప్పి వచ్చే చోట, వాపు కూడా కనిపించవచ్చు.

ఎముక విరగడం : సాధారణంగా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందిన ప్రాంతంలో ఎముక బలహీనంగా మారుతుంది. అందుకే అక్కడ అది తేలిగ్గా విరుగుతుంది.

శరీర కదలికలు తగ్గడం : సాధారణంగా ఎముక క్యాన్సర్‌లో కణితి కీళ్ల వద్ద వస్తే మామూలు కదలికలు సైతం తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. కాబట్టి శరీర కదలికలు తగ్గుతాయి.

ఇతర లక్షణాలు: ఎముకల్లో నొప్పితో పాటు బరువు తగ్గడం వంటి అవాంఛిత పరిణామాలూ, నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. క్యాన్సర్ ఇతర అవయవాలకు పాకితే సదరు అవయవానికి చెందిన లక్షణాలూ కనిపిస్తుంటాయి. 

bone-cancer-healthy-food-fit-and-healthy-health-ti

చికిత్స :

ఎముక క్యాన్సర్‌కు ఇప్పటివరకూ అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయ చికిత్స ప్రక్రియలు... శస్త్రచికిత్స, కీమోథెరపీ, ఫ్రాక్షనేటెడ్ డోస్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ.

శస్త్రచికిత్స : ఇక ఎముకల మృదు కణజాలానికి క్యాన్సర్ వస్తే అనుసరించే ప్రక్రియల్లో శస్త్రచికిత్స చాలా సాధారణం. ఈ శస్త్రచికిత్సల్లోనూ తొలిదశలో క్యాన్సర్‌ను గుర్తించినా లేదా చుట్టూ ఉన్న మృదుకణజాలానికే క్యాన్సర్ పరిమితమైనా... శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరించి నప్పటికీ, వ్యాధి సోకిన అవయవాన్ని సాధ్యమైనంత వరకు తొలగించకుండా రక్షించడానికే ప్రయత్నిస్తారు.


ఒకవేళ క్యాన్సర్ ముదిరిపోయిన దశలో ఉంటే అప్పుడు కూడా అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితుల్లోనూ... కేవలం ఎముకను మాత్రమే తొలగించి, దాని స్థానంలో లోహంతో తయారు చేసిన, కొత్తదైన కృత్రిమ ఎముకను అమర్చి అవయవం ఎప్పటిలాగే ఉంచేలా చూస్తారు.

ఒకవేళ క్యాన్సర్ గనక లింఫ్‌నోడ్స్‌కు చేరితే... (లింఫ్‌నోడ్స్... అన్ని అవయవాలకూ క్యాన్సర్‌ను చేర్చే గేట్ వే లాంటివి కాబట్టి) వాటిని పూర్తిగా తొలగిస్తారు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కణజాలాన్ని తొలగించాక... ఆ అవయవం మునుపటి ఆకృతి కోల్పోతే... అది ముందులాగే ఉండేలా చూసేందుకు ‘రీ-కన్‌స్ట్రక్టివ్ సర్జరీ లేదా రీప్లేస్‌మెంట్ సర్జరీ’ని నిర్వహిస్తారు. ఇక క్యాన్సర్ కారణంగా ఎముకలకు తీవ్రమైన నొప్పి వస్తే... చివరి ఉపశమనంగా నిర్వహించే శస్త్రచికిత్సను ‘ప్యాలియేటివ్ సర్జరీ’ అంటారు.  

bone-cancer-healthy-food-fit-and-healthy-health-ti
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
మరోసారి మంటకలిసిన మానవత్వం!
నాన్నగారి ఆరోగ్యం బాగుంది : గౌతమ్
ప్రపంచ కప్ లో కి పంత్ తీసుకోవడం సరికాదు! : సచిన్
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
ఎన్టీఆర్, రాంచరణ్ లకు జక్కన్న షాక్!
హాస్యనటుడు బ్రహ్మానందం కు బైపాస్‌ సర్జరీ!
ఆసక్తి రేపుతున్న ప్రియా ప్రకాశ్‌.. ‘శ్రీదేవి బంగ్లా’ టీజర్!
ఏదీ ఆనాటి పండుగ వాతావరణం..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.