పాల ఉత్పతులు
బరువు పెరగటానికి అందుబాటులో ఉన్న ఆరోగ్యకర ఆహార పదార్థాలుగా వీటిని పేర్కొనవచ్చు. పాల నుండి ప్రోటీన్ మరియు కాల్షియంలను పొందుతారు. చీస్ మరియు పెరుగు వంటి పాల ఉత్పత్తులు ఆరోగ్యకర శరీర బరువును పెంచుతాయి.
Image result for milk
నట్స్
ఒక పిడికెడు నట్స్ నుండి కొన్ని వందల ఆరోగ్యకర కేలోరీలను పొందుతారు. ఇవి ప్రోటీన్, విటమిన్ 'E' మరియు ఫైబర్ లను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. వీటిని సలాడ్ లతో, భోజనంలో లేదా స్నాక్స్ గా కూడా తినవచ్చు. పీ నట్ బటర్ కూడా అధిక మొత్తంలో కేలోరీలను కలిగి ఉంటుంది కావున సలాడ్, సాండ్విచ్, టోస్ట్ వంటి వాటితో తీసుకోవచ్చు.
Image result for nuts
డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ లను నట్స్ తో కలిపి తీసుకోవటం వలన బ్రేక్ఫాస్ట్ లో మంచి పోషకాలను పొందినవారవుతారు. సగం కప్పు రెసిన్ లు 200 కేలోరీలతో పాటూ విటమిన్, మినరల్ మరియు ఫైబర్ లను కలిగి ఉంటాయి. వీటిని సాయంత్రపు సమయంలో స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు.
Image result for dri foods
ఆరోగ్యకర కొవ్వు పదార్థాలు
ఆలివ్ ఆయిల్, కానోలా ఆయిల్, సోయా ఆయిల్, ఆవాల నూనె మరియు కొబ్బరి నూనె లలో కొవ్వు పదార్థాలను కలిగి ఉండే ఆహార పదార్థాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇవి మన గుండెకు చాలా ఆరోగ్యకరం మరియు ఒక చెంచా నూనెలో 45 కేలోరీలను కలిగి ఉంటాయి. హోల్ వీట్ బ్రెడ్ లను వీటిలో ముంచుకొని తినవచ్చు లేదా సలాడ్ లలో కలుపుకొని తినటం వలన అదనపు కేలోరీలను పొందినవారవుతారు.

బలాన్ని పెంచే ట్రైనింగ్
తక్కువ బరువు ఉన్న వారి కండరాలలో అదనపు పౌండ్లను కలుపుటకు, ఇదొక మార్గంగా చెప్పవచ్చు. కండరాల బలం, అధిక కొవ్వు పదార్థాలు మీ శరీరాన్ని ఒక మంచి ఆకృతిలో మారటానికి సహాయపడతాయి. మంచి ఫలితాల కోసం లెగ్స్, ఆర్మ్స్, వెన్నుభాగం, ఛాతి, శోల్డర్స్ మరియు పొట్ట ప్రాంతానికి చెందిన వ్యాయామాలను చేయండి. ఇలా చేయటం వలన శరీరం మంచి ఆకృతిని సంతరించుకుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: