ఇవి ఒంట్లో వేడికి, పొట్ట తగ్గడానికి బాగా పని చేస్తాయి...ఇంగ్లీష్ లో basil seeds అంటారు. బేసిల్ తులసి జాతికి చెందిన మొక్కే. ఈ మొక్క గింజలే ఇవి. ఇవి నీటిలో నానితే పెద్దగా ఉబ్బుతాయి. వేసవికాలం వచ్చిందంటూ సబ్జాలతో కాచిన నీళ్లు తాగమని పెద్దలు చెప్పేవారు. దీనికి వేడిని తగ్గించే గుణంతో బాటు, వేడి నుంచి రక్షించే శక్తి ఉంది.

పీచు పదార్థం బాగా ఎక్కువ. డైటింగ్ చేసేవారికి వరమే. మహిళలకు కావాల్సిన ఫోలేట్ తో పాటు విటమిన్ E కూడా లభిస్తుంది. క్రీడాకారులకు బాడీ లో తేమ పోనికుండా ఉపయోగపడతాయి.

ఈ మధ్య బాగా వింటున్న ఒమేగా-3 సాల్మన్ చేపలలో కంటే ఇందులో ఎక్కువగా లభిస్తుంది. బాగా చంటిపిల్లలు, వృద్దులు, గర్భిణులు తప్ప మిగిలిన వారు అందరూ తాగచ్చు.

Image result for సబ్జా గింజలు

సబ్జా గింజలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడంలో సాయపడతాయి. గ్లాసు నీళ్లలో నాలుగు చెంచాల సబ్జా గింజలను వేసి నానబెట్టాలి. అరగంట తర్వాత గ్లాసు పచ్చిపాలలో వేసుకుని, కొన్నిచుక్కల వెనిల్లా కలిపి తాగాలి. ఇది టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనాన్నిస్తుంది. సబ్జా గింజల పాలను కాఫీ, టీలకు బదులు తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపులో మంట తగ్గుతాయి.


వీటిలో విటమిన్లూ, పోషకాలూ, ఇనుమూ ఎక్కువగా ఉంటాయి. చిన్న కప్పు సబ్జా గింజలను తరచూ తీసుకోవడం వల్ల కావాల్సినంత ఇనుమూ, పోషకాలూ శరీరానికి అందుతాయి. రోగ నిరోధక శక్తి సొంతమవుతుంది.


రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలో,శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జ గింజలు ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: