సైంధవ లవణం పావు టీ స్పూను పొడి అర చేతిలో వేసుకొని ఆవాలనూనే ఒకటి లేక  రెండు చుక్కలు మాత్రమే కలిపి తోమితే పగిలిన,పూచిన,నెత్తురు కారుతున్న అన్ని దంత భాగాలకు మెత్తగా  పూసి ,మెత్తగా తోమాలి. అరగంట అలా వదిలెయ్యాలి. నోట్లో ఊరే నీటిని ఉమ్మేయ్యాలి. 
తరువాత వేడి నీటితో కడుక్కోవాలి. అద్భుతమైన మార్పు వస్తుంది.
👉నువ్వుల నూనెను నోట్లో పోస్తుకొని బాగా పుక్కిలించాలి. లేదా ఉదయాన్నే నువ్వులను బాగా పిప్పి లా  అయ్యే వరకు నమిలి  ఒక గ్లాసు నీళ్ళు తాగాలి. 

👉మొదట ముందు పళ్ళను గట్టిగా నొక్కి పెట్టి తరువాత వదలాలి. తరువాత దవడ పళ్ళను నొక్కాలి. 

👉చూపుడు వేలితో లోపలి చిగుళ్ళను నొక్కాలి. నాలుకతో పళ్ళ లోపలివైపు నొక్కుతూ  వుండాలి.

1. పన్ను నొప్పి వచ్చినపుడు రెండు తులసి ఆకులను మెత్తగా నూరి పంటి మీద పెట్టాలి. నొప్పి తగ్గి నిద్ర పడుతుంది. 

2. తులసి ఆకుల రసంలో దూది ముంచి పిప్పి పన్ను మీద పెట్టి పై పంటితో నొక్కాలి. నొప్పి తగ్గుతుంది. మి నవీన్ నడిమింటి 


మరింత సమాచారం తెలుసుకోండి: