చాలా మందికి గ్యాస్‌, అజీర్తి సమస్యలు వేధిస్తుంటాయి. దీంతో తాత్కాలిక ఉపశమనం కోసం మెడికల్ షాపుల్లో లభించే గ్యాస్ ట్రబుల్, యాంటాసిడ్ మాత్రలను వాడుతుంటారు. అయితే, ఈ మాత్రలను వాడటం వల్ల పెనుముప్పు తద్పని తాజా అధ్యయనం చెపుతోంది.

Image result for gas acidity

ఒక యేడాది పాటు రోజూ ఈ మాత్రలను వాడితే పొత్తికడుపు క్యాన్సర్స్‌ వచ్చే అవకాశాలు ఐదు రెట్లు పెరుగుతాయని, మూడేళ్లు వాడితే క్యాన్సర్‌ ముప్పు 8 రెట్లు పెరుగుతుందని తేలింది. క్యాన్సర్‌ కణాలను పెంచే గ్యాస్ట్రిన్‌ హార్మోన్‌ కారణంగా ఈ రిస్క్‌ పొంచిఉందని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.హాంకాంగ్‌లో 63,000 మందిపై తాజా అథ్యయనం నిర్వహించారు.

Image result for gas acidity

యేడేళ్ల పాటు వీరిని గమనించగా వారానికి ఒకసారి యాంటాసిడ్‌ మాత్రలను తీసుకున్న వారిలో పొత్తికడుపు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు రెండు రెట్లు అధికంగా ఉన్నట్టు పరిశోధకులు వెల్లడించారు. గతంలోనూ యాంటాసిడ్స్‌ తరచూ తీసుకుంటే గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, డిమెన్షియా వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు వెల్లడించిన విషయం తెల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: