ఈ నవీణ కాలంలో మనిషి అత్యాధునిక పోకడలకు పోతున్నారు.  ప్రతి విషయాకి  టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు  ఇంట్లో ఉన్నప్పుడు టీవీ ముందో, ఆఫీస్‌లో కంప్యూటర్ ముందో ఎక్కువ సేపు కూర్చోవడం తప్పనిసరి అవుతున్నది. పెద్దల మాట అటుంచితే... పిల్లలు ఆడుకోవడం కూడా కంప్యూటర్స్‌తోనే కావడంతో... కళ్లు విపరీతమైన అలసటకు గురవుతున్నాయి. టీవీ, కంప్యూటర్ స్క్రీన్‌లను రెప్పవేయకుండా చూడటం వల్ల చూపు మందగించే ప్రమాదం ఉంది. అందుకే... యోగా ప్రక్రియల ద్వారా ఈ బాదను నివారించవచ్చు.  

Image result for YOGA FOR EYES

త్రాటక క్రియ: పద్మాసనంలోకానీ, వజ్రాసనంలోకానీ ధ్యానం చేసే విధంగా కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. కళ్లకు సమానమైన ఎత్తులో కొద్ది దూరంలో దీపం లేదా క్యాండిల్ ఉంచాలి. కళ్లు రెప్పవేయకుండా క్యాండిల్ వైపు చూడాలి. కళ్లు మండటం లేదా నీళ్లు వచ్చినట్టు అనిపిస్తుంది. అయినా రెప్పవేయకుండా అలాగే చూస్తూ ఉండాలి. కన్నీరు ఒకసారి కారిన తరువాత నెమ్మదిగా కళ్లు మూసుకుని కొద్దిసమయం పడుకోవాలి. 

Image result for YOGA FOR EYES

ప్రయోజనాలు : 
- కన్నీటి గ్రంథులు జాగృతం అవుతాయి. 
- దృష్టి లోపాలు సరి అవుతాయి. 
- ఏకాగ్రత పెంపొందుతుంది. 
- మొండి పనిచేసి మనసును శాంతపరుస్తుంది.
 - మానసిక నిగ్రహం అలవడుతుంది. 
Image result for YOGA FOR EYES
జాగ్రత్తలు : - పదిహేను సెకన్ల తో మొదలుపెట్టండి. 
- ఇది అయిన తరువాత తప్పక విశ్రాంతినివ్వాలి . లేకపోతే హెడెక్ వచ్చే అవకాశం ఉంది. 
- ఎక్కువగా TV చూడటం లేదా Computer వాడకం వల్ల వచ్చే రెప్పలు వాల్చడం బాగా తగ్గుతుంది.  
1. వజ్రాసనంలో నిటారుగా కూర్చొని రెండు చేతులను ఇరువైపులకు చాపాలి. పిడికిలి బిగించి, బొటనవేలును మాత్రమే పైకి లేపాలి. ఇప్పుడు శ్వాస తీసుకుని ... శ్వాస వదులుతూ మెడ ఏమాత్రం కదలకుండా కళ్లను మాత్రమే కదిల్చి కుడి బొటనవేలివైపు చూడాలి. ఐదు సెకన్లపాటు ఉంచి, తిరిగి కళ్లను యథాస్థానానికి తీసుకురావాలి. ఇలా ఐదుసార్లు ఎడమవైపు, ఐదుసార్లు కుడివైపు చేయాలి. 
 2. కాళ్లను ముందుకు చాచి నిటారుగా కూర్చోవాలి. ఇప్పుడు పిడికిలి బిగించి బొటన వేలు ఎత్తి ఎడమ చేతిని ముఖానికి ఎదురుగా, కుడి చేతిని భుజానికి సమాంతరంగా తీసుకురావాలి. ఇప్పుడు ముందుకు తెచ్చిన ఎడమచేతి బొటనవేలు వైపు చూడాలి. ఐదు సెకన్లపాటు ఉంచి, తిరిగి కళ్లు యథాస్థానానికి తీసుకురావాలి. ఐదు సార్లు చేయాలి. అదేవిధంగా కుడిచేతితోనూ చేయాలి.  
3. ముందుకు కాళ్లు చాచి నిటారుగా కూర్చోవాలి. ఎడమ చేతిని, ఎడమ తొడపై ఉంచి కుడిచేతిని 45 డిగ్రీల కోణంలో చాచి, పిడికిలి బిగించి బొటనవేలును పైకి ఎత్తాలి. ఇప్పుడు మెడ కదిలించకుండా కళ్లను మాత్రమే కదిలిస్తూ కుడిచేతి బొటనవేలుని 


మరింత సమాచారం తెలుసుకోండి: