ఆకు కూరల వల్ల మనిషికి ఎన్నో లాభాలు ఉన్నాయి. మాంసాహారం కన్నా ఆకు కూరలతో చక్కటి ఆరోగ్యం లభిస్తుంది.  గుండె బలహీనంగా ఉన్నవారు, నాడీమండలం బలహీనంగా ఉన్నావారు కూడా పై మిశ్రమాన్ని సేవిస్తుంటే మంచి ఫలితాలు పొందగలరు. తోటకూర ఆకులు నుండి తీసిన రసం ప్రతిరోజూ తలకు రాసుకుంటే కేశాలు ఏపుగా ఒత్తుగా పెరిగి నల్లగా నిగనిగలాడుతాయి. అంతేకాక జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది. తోటకూర ఆకుల రసలో కొద్దిగా పసుపు కలిపి, ప్రతిరోజు ముఖానికి రాసుకుంటుంటే ముఖంపై ముడుతలు, మొటిమలు అంతరించి చర్మం నునుపుగా కాంతివంతంగా ఉంటుంది.

తోటకూర ఆకుల రసం, పాలు, నిమ్మరసం బాగ కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రించే ముందు ముఖానికి అరగంటసేపు మర్థన చేసి నులివెచ్చని నీటితో కడుగుతూ ఉంటే ముఖసౌందర్యం రెట్టింపవుతుంది. గజ్జి, దురద, లాంటి చర్మవ్యాధులున్నవారు తోటకూర ఆకుల రసంలో కొద్దిగా సల్ఫర్ కలిపి ప్రతిరోజూ పై పూత మందుగా రాసి, ఒకటి రెండు గంటల తరువాత స్నానం చేస్తే వ్యాధులు అంతంరిస్తాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: