‘ట్రేగ్-సెల్స్’  అనబడే ఒక రకమైన లింపోసైట్స్ - గర్భిణిగా ఉన్న తల్లికి హెచ్.ఐ.వి (ఎయిడ్స్) సోకిన పక్షంలో, ఆ పిండానికి ఆ ఇంఫెక్షన్ రాకుండా నియంత్రిస్తాయని పరిశోధకులు భావిస్తు న్నారు. 'హెచ్.ఐ.వి ఇన్-ఫెక్షన్' ను నిరోధించి దేహాన్ని బలవర్ధకం చేసి జబ్బును తట్టుకునేలా సంసిద్ధపరచటానికి కావలసిన విషయాలను తాము పరిశీలిస్తున్నామన్నారు 'ఎమోరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్' కు చెందిన పరిశోధకులు పీటర్ కెస్లర్.


హెచ్.ఐ.వి ఇన్-ఫెక్టెడ్ తల్లులకు జన్మించిన బిడ్డలకు హెచ్.ఐ.వి ఇన్-ఫెక్షన్ సోకిన సందర్బాలు తక్కువే ఐనా ఇది కొంత ఆశ్చర్యానికి గుఱిచేస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతానికి హెచ్.ఐ.వి ఇన్-ఫెక్షన్ ను నియంత్రించటానికి యాంటీ రెట్రోవియల్ మందులు వాడుతామన్నారు. కాని ఈ మందులు జీవితాంతం వాడవలసి ఉంటుందని అన్నారు.


దీనికంటే మంచి పరిష్కారం ఆ ఇన్-ఫెక్షన్ రాకుండా ముందుగా  (ప్రివెన్షన్) నిరోధించటమే. అయితే దానికి ఇప్పటివరకు వాక్సీన్ ను రూపొందించలేదన్నారు. పరిశోధన ల ప్రకారం హెచ్.ఐ.వి ఇన్-ఫెక్టెడ్ తల్లులకు ఇన్-ఫెక్షణ్ ను తప్పించుకొని అప్పుడే జన్మించిన పిల్లల రక్తంలో ట్రెగ్-సెల్ లింపొసైట్స్, హెచ్.ఐ.వి ఇంఫెక్టెడ్ పిల్లల్లో కంటే అధికంగా ఉన్నట్లు గుర్తించారు.

Image result for american society for microbiology - ASM microbe Vaccine for HIV

అయితే ఈ లింపోసైట్స్ బాక్టీరియా వైరస్ లను ఎదుర్కోవటానికి ఉపయోగపడే ఇమ్యూన్ సిస్టం ను అభివృద్ది చేస్తాయి. అంటే ఈ ట్రెగ్-సెల్ లింపొసైట్స్ ఆ జబ్బు రాకుండా అడ్డుకొనే సిస్టమ్ను సిద్ధం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ట్రెగ్-సెల్స్ నే 'నియంత్రించే టి-సెల్స్ ' అంటారు. రోగనిరోధక వ్యవస్థను నాశనం చేసే ఎక్కువగా స్పందించే రోగనిరోధక వ్యవస్థను దాని కణ జాలం నాశనం కాకుండా స్వయంగా సర్దుబాటు చేస్తాయి.


ఈ పరిశోధకులు 64 హెచ్ ఐ వి ఇన్-ఫెక్షన్ సోకకుండా జన్మించిన పసిపాపలను 28 మంది హెచ్ ఐ వి సోకిన పసిపాపల నుండి సేకరించిన రక్తాన్ని పరిశీలించి ఇన్-ఫెక్షన్ సోకని పాపల రక్తంలో ట్రెగ్-సెల్స్ సంఖ్య ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు ట్రెగ్-సెల్స్ కాని ఇతర రకాల లింపొసైట్స్ పరిమాణం హెచ్ ఐ వి ఇన్-ఫెక్టెడ్ బేబీస్ లో యాక్టివేట్ చేసి చూస్తే అవి ఇన్-ఫెక్ట్ అవటం గమనించటంతో  ట్రెగ్-సెల్స్ మాత్రమే ఇన్-ఫెక్షన్ అణచివేయగలవని గుర్తించారు.

Image result for treg cells function

విభిన్నకణాలని గుర్తించే ఒకరకమైన సైటోమెట్రీ టెక్నిక్ రక్తప్రసరణతో ఈ టి-సెల్స్ బహువిధ ప్రయోజనాలను విశ్లేషించటం జరిగింది. తద్వారా అతి తక్కువ సంఖ్యలో పసివాళ్ళను వారు పుట్టకముందు వారిలోని ట్రెగ్-సెల్స్ అనబడే లింపోసైట్స్ ఏవిధంగా ఇతర సెల్స్ను యాక్టివేట్ చేసి రోగ నిరోధకత్వాన్ని అభివృద్ది చేస్తాయో విశ్లేషించి - తద్వారా వాక్సీన్ రూపొందించటానికి ఉద్యుక్తులౌతున్నారు. అంటే కాదు ఈ సెల్స్ హెచ్ ఐ వి ఇన్-ఫెక్షన్ కలిగించే దానితో పాటు ఇతర దీర్ఘకాలిక జబ్బులను పెంచే కారకాలను బిడ్దలు పుట్టకమునుపే నియంత్రించటానికి తగిన వాక్సీన్ తయారీలో ఈ ప్రయోగాలు ఉపయోగపడతాయో కెస్లర్ తెలియజేశారు.

Treg Cells Protect Babies from Getting HIV Infection from their Mothers

ఈ ఫలితాలే విభిన్న రకాల వ్యాధినిరోధక టీకాలు తయారు చేయటానికి ఉపయోగపడటాయి అనటంలో ఎలాంటి సందేహంలేదు. ఈ పరిశోధన గురించి 'ఏఎస్సెం మైక్రోబ్' (ASM Microbe) అనబడే "అమెరికన్ సొసైటీ ఆఫ్ మైక్రొబయాలజీ" వార్షిక సభలో ప్రస్థావించారు కెస్లర్. 

 Image result for american society for microbiology - ASM microbe

మరింత సమాచారం తెలుసుకోండి: