మనిషి సంపూర్ణ అరోగ్యం పొందాలంటే మనం తినే తిండితో పాటు  వ్యాయామం..యోగా చేయడం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.  అయితే యోగాతో వలన కలిగే ప్రయోజనాలపై  పలు అథ్యయనాలు వెల్లడించగా తాజాగా రోజూ యోగా చేస్తే వీర్యకణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఎయిమ్స్‌ నిర్వహించిన అథ్యయనం పేర్కొంది.
Image result for yoga mens
ఎయిమ్స్‌కు చెందిన శరీరనిర్మాణ శాస్త్ర విభాగం నిపుణులు చేపట్టిన ఈ సర్వే నేచర్‌ రివ్యూ యూరాలజీ పత్రికలో ప్రచురితమైంది. డీఎన్‌ఏ దెబ్బతినేందుకు శరీరంలోనిఆక్సిజన్‌ సామర్ధ్యం, రాడికల్‌ లెవెల్స్‌ల మధ్య సమతుల్యత లోపించడంతో ఆక్సిడేటివ్‌ ఒత్తిడికి దారితీయడమే కారణమని విశ్లేషించారు. జీవనశైలి మార్పుల ద్వారా వీటిని నిరోధించవచ్చని చెప్పారు.
Image result for yoga mens
ఈ మద్య 6 నెలల పాటు యోగా అభ్యసించిన 200 మంది పురుషులపై పరిశోధన జరపగా వీరిలో డీఎన్‌ఏ నాణ్యత మెరుగుపడినట్టు, ఆక్సిడేటివ్‌ ఒత్తిడి తగ్గుముఖం పట్టినట్టు తాము గమనించామన్నారు. ఫ్రీ రాడికల్‌ స్థాయిలను తగ్గించి డీఎన్‌ఏ విచ్ఛినం కాకుండా యోగా నిరోధిస్తుందని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: