యోగా ప్రక్రియలో కాయకల్ప యోగా అనేది అత్యంత ముఖ్యమైన ప్రక్రియ ఇది ఎంతో ప్రాచుర్యం పొందిన యోగా విధానం..మనిషి జీవన శక్తిని మెరుగు చేయడం మరియు ఎంతో శక్తి వంతుడిగా చేయడం ఈ ప్రక్రియ ముఖ్య నియమం..వృద్ధాప్యం దూరం చేయడంతో ఈ కాయకల్ప ఎంతో ప్రాముఖ్యతని పొందింది..జీవితకాలం పెంచుతుంది కూడా..లైంఘిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చడంలో ఈ కాయకల్ప యోగా ఎంతో ఉపయోగపడుతుంది

.Image result for kayakalpa yoga

 

శరీర కేంద్ర నాడీ వ్యవస్థని బలోపేతం చేయడానికి సమరియు కండరాల్ని ఒక క్రమంగా ఎంతో ధృదంగా చేయడానికి ఈ యోగ ఉపయోగపడుతుంది.."క్రౌన్ చర్కా" అనే ఆసనం వుంటుంది, దీనిని నుదుటి మధ్య భాగంలో ఉంచుతారు అది శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. ఈ సాధనను ఆచరించడం వలన మనం ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండేలా ప్రోత్సహిస్తుంది.

 kayakalpa_diagram

కాయకల్ప యోగ భంగిమల అనుసరణ

  కాయకల్ప యోగా ద్వారా శాస్వ సంభందిత వ్యయామాలే కాకుండా శరీరం మొత్తం శక్తి ప్రవహింపజేసి శరీరాన్ని ఎంతో ఉత్తేజంగా చేయడంలో సహాయ పడుతుంది..

  ఈ యోగా ప్రక్రియ కూర్చిని చేయడం వలనే జరుగుతుంది..శ్వాస పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది..

  ఈ యోగా ప్రక్రియలో  శ్వాస సాధనలోని ఉద్దేశ్యం లోతైన శ్వాసను తీసుకొని లోపలే నొక్కిపట్టడం అలాగే శ్వాస వ్యవస్థ నిర్మాణం. శ్వాసను నెమ్మదిగా లోనికి పీల్చుకొని మరియు తర్వాత నోటి            ద్వారా బలవంతంగా భయటకు విడుదల చేయడం జరుగుతుంది.ఆ..అయితే ఈ ప్రక్రియని చేయడం వలన  ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి మరియు విశ్రాంతిని కల్పిస్తుంది.

  కాయకల్ప యోగా లో “భస్తిక” అనేది మరొక పద్ధతి ఉంది ఇందులో ముక్కు ఒక రంధ్రం ద్వారా శ్వాసని పీల్చుకొని మరియు ఆ రంధ్రాన్నిమూసివేసి మరొక రంధ్రం నుండి శ్వాసను బలవంతంగా          భయటకు విడుదల చేయడం జరుగుతుంది..ఇలా చేయడం వలన ఊపిరితిత్తులు ఎంతో శుభ్రపరచుకోవచ్చు

      అయితే యోగా లో ఎటువంటి సాధన చేయాలని అనుకున్నా సరే తప్పకుండా గురువు ఆధ్వర్యంలో చేయడం ఎంతో ఉత్తమం.

Image result for kayakalpa yoga

కాయకల్ప యోగా వలన కలిగే  ఉపయోగాలు

  కాయకల్ప జీవిత కాలాన్ని పెంచి వృద్దాప్య ప్రక్రియను మెల్లగా జరిగేలా చేస్తుంది..రోగనిరోధకశక్తిని పెంచుతుంది.. ఎలాంటి వ్యాధులు సోకకుండా చేస్తుంది.

  జీవనశైలిని మార్చటానికి సహాయపడుతుంది..కాయకల్ప ఎంతగానో ఉపయోగపడుతుంది..వంశాను పరంగా వచ్చే సమస్యలని తగ్గిస్తుంది..

  మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఎంతో శక్తివంతంగా చేస్తుంది మరియు రుతు చక్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది..మహిళలకి ఎంతో శక్తిని కలిగిస్తుంది.

  దీర్ఘకాలిక వ్యాధులైన ఉబ్బసం, మధుమేహం, అర్శమొలలు మరియు చర్మ సంబంధ వ్యాధుల నుండి వచ్చే సమస్యలను కాయకల్ప యోగా తగ్గిస్తుంది..

  నాడీ వ్యవస్థ యొక్క విధులను మెరుగుపరుస్తుంది...మెదడుని చురుకుగా చేస్తుంది.

  దైనందిక జీవితంలో మనిషి ఎంతో మానసిక శక్తిని కోల్పోతున్నాడు..ఈ యోగా లో ప్రశాంతతని కలిగి ఉండేలా చేస్తుంది మరియు ఆధ్యాత్మిక సంతృప్తిని కలుగజేస్తుంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: