యోగా మానసిక ప్రశాంతకి సరైన మందు..ఎంతో మంది మానసిక ఒత్తిడి నుంచీ బయటపడటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే క్రమం తప్పకుండా యోగా చేస్తూ ఉండే వారికి అనారోగ్య సమస్యలు ఏంతో దూరంగా ఉంటాయి..అయితే ఈ యోగాని నేర్చుకోవడమే కాక నేర్చుకున్న విద్యని నలుగురికి చెప్తూ దానిని ఒక ఉపాది మార్గంగా కూడా ఉపయోగించుకోవచ్చు..అయితే ఈ యోగాలో ఉపాది అవకాశాలు..యోగా సంభందించిన కోర్సుల వివరాలు ఎక్కడెక్కడ యోగా విద్యని నేర్పుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

 yoga instructors in india కోసం చిత్ర ఫలితం

యోగా ఇన్స్ట్రక్టర్ అవ్వాలని అనుకునే వారు  మీ 12 వ క్లాసుఆ నుంచీ కానీ లేదా  యోగాలో  డిప్లమా లేదా డిగ్రీ వుంటే  మీకు చాలా ఉద్యోగ అవకాశములు దొరుకుతాయి.మీ ఉన్నత విద్య పూర్తి చేసుకున్న తరువాత  మీ అవకాశముల కొరకు  పాఠశాలలకు, హాస్పటళ్ళకు , ప్రభుత్వ సంస్థలలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా అవుతారు...భారత దేశములో  చాలా పబ్లిక్, ప్రైవేటు కాలేజీలు ,విద్యా సంస్థలు మరియు యూనివర్సిటీలు  అన్ని స్తాయిలలో యోగ  కోర్సులు అందిస్తున్నాయి.

 à°¸à°‚బంధిత చిత్రం

బి ఎ,/ బి ఎస్ సి,/ ఎం ఎ,/ ఎం ఎస్ సి,  ఎం ఫిల్, మరియు పి ఎచ్ డి...మీరు బి ఎ లేదా బి ఎస్ సి యోగ  థెరపి ప్రోగ్రాం లో చేరటానికి  మీరు కనీసము 17 ఏళ్ళు ఉండాలి...మరియు మీ 12 వ క్లాసు ఫిజిక్స్ , కెమిస్ట్రీ  , బయాలజీ సబ్జక్టులతో కనీసము 50%  ఏగ్రిగేట్  మార్కులతో పాసయివుండాలి. ఏమ్మేసీ , ఎంఏ ఈ ఫీల్డ్ కోర్సులలోచేరటానికి మీరు మొదత ఈ ఫీల్డ్ లో బీఎస్సీ  లేదా బీఏ   డిగ్రీలు పూర్తి ఉండాలి.

 yoga colleges కోసం చిత్ర ఫలితం

భారత దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు యోగా నేర్పుతూ ఎంతో మంది నిష్ణాతులు అయిన వారిని యోగా యోధులుగా చేస్తున్నారు అయితే  భారత దేశంలో ఉన్న అని యోగా కేంద్రాలని ఒక సారి పరిశీలిస్తే.

అలగప్ప యూనివర్సిటీ, కరైకుడి, తమిళనాడు.

ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖ పట్టణం, ఏపీ

అన్నామలై యూనివర్సిటీ,, చెన్నై,

బంగళూరు యూనివర్సిటీ,బంగళూరు , కర్నాటక.

బర్కతుల్లా విశ్వవిద్యాలయ, భోపాల్, మధ్యప్రదేష్.

భారతీ దాసన్  యూనివర్సిటీ, ట్రిచీ, తమిళ నాడు.

భారతియార్ యూనివర్సిటీ, కోయం బత్తూర్, తమిళనాడు.

భావనగర్ యూనివర్సిటీ, భావ్ నగర్ , గుజరాత్.

 ఇలా అనేకరకాల నైపుణ్యం కలిగిన సంస్థలు ఎన్నో ఉన్నాయి...చాలా మంది సాంకేతిక నైపుణ్యులు, మంచి వృత్తి లో ఉన్నవారు సైతం వారి ఉన్నత ఉద్యోగ అవకాశములను కూడా వదులుకొని యోగా ట్రైనర్లు మారుతున్నారు ఈ వృత్తిలో మానసిక సంతోషం ఉంటుంది..అంతేకాదు ఎంతో మంది  పార్ట్ టైం యోగా  ట్రైనర్లుగా వుండటానికి ఎన్నుకుంటారు

 yoga colleges కోసం చిత్ర ఫలితం

యోగా సైన్స్  అనేక ఉద్యోగ, రీసర్చ్, ట్రైనింగ్, మరియు పని అవకాశాలకు దారి  కల్పిస్తుంది. వీటిలోకొన్ని:

అసిస్టెంట్ ఆయుర్వేదిక్ డాక్టర్, క్లినికల్ సైకాలజిస్ట్, రీసర్చ్ ఆఫీసర్- యోగ మరియు నాచురోపతి, థెరపిస్ట్ మరియు నాచురోపత్స్ , ఇంస్ట్రక్టర్  హెల్త్ క్లబ్, యోగ ఎరబిక్ ఇంస్ట్రక్టర్, యోగ ఇంస్ట్రక్టర్ లేక టీచర్ యోగ థెరపిస్ట్.

 yoga colleges కోసం చిత్ర ఫలితం

యోగా థెరపిస్ట్ లని ఎక్కువగా జిమ్ములు స్కూల్స్ , అతి పెద్ద ఆరోగ్య సంస్థలు ఆరోగ్య కేంద్రాలు హౌసింగ్ సొసైటీ లలో ఉపయోగపడుతూ ఉంటారు వారినే నియమించుకుంటూ ఉంటారు.. హాస్పటళ్ళు , హెల్త్ రిసార్ట్ లు మరియు యోగా సెంటర్లు  యోగాలో అనుభవముఉన్న, ట్రైనింగ్ అయిన వారిని బోధనకొరకు, రీసెర్చ్  పరిపాలనా అవసరాలకు కూడా  వినియోగించుకుంటారు..ఎప్పటినుంచి అయితే ఐక్యరాజ్య సమితి  జూన్ 21 వ తారీకును యోగాదినముగా ప్రకటించినదో , అప్పటి నుంచి యోగా టీచర్లకు, యోగా  ఇంస్ట్రక్ట ర్లకు ఉద్యోగ అవకాశములు అకస్మాత్తుగా పెరిగిపోయాయి..ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రంగాలలో యోగా పట్ల మక్కువ పెరిగిపోయింది..పోను పోను యోగా కి ఉన్న డిమాండ్ దృష్య్టా దేశవిదేశాలలో ఉపాది అవకాశాలు కూడా పెరిగిపోతాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: