మన శరీరానికి శక్తినందించే దుంపల్లో బీట్‌రూట్ కూడా ఒకటి అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే మనలో చాలామంది ఈ బీట్ రూట్ ను కూరగా గుర్తిస్తారు కాని ఈ బీట్ రూట్ లో చేసే జ్యూస్ తో కలిగె ప్రయోజనాలను ఎవరు పెద్దగా గుర్తించరు. అయితే ఈ బీట్ రూట్ జ్యూస్ తో అనేక అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని లేటెస్ట్ అధ్యయనాలు చెపుతున్నాయి.

ప్రతిరోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ తాగితే దాంతో శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది దీనితో బరువు తగ్గుతారు. అంతేకాదు ఎప్పుడూ బద్దకంగా ఉండే వారు బీట్‌ రూట్ జ్యూస్ తాగితే యాక్టివ్ గా ఉంటారని అధ్యయనాలు కూడ అంగీకరిస్తున్నాయి. దీనికి కారణం ఈ జ్యూస్ మనలోని చురుకు తనాన్ని పెంచి అలిసి పోకుండా చేస్తుంది. 

ముఖ్యంగా గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే ఎంతో మంచిది. దీనితో వారికి కావల్సిన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. తద్వారా అది కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తోడ్పడి శిశువు ఆరోగ్యంగా పుడుతుంది. బీట్ రూట్ లో ఉండే విటమిన్ ఎ, సి, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడటమే కాకుండా వారి జ్ఞాపకశక్తి పెరుగుదలకు ఎంతగానో సహకరిస్తుంది. 

ప్రస్తుతం చాలందిని కలవర పెడుతున్న గుండె సమస్యలు రాకుండా అరికట్టడమే కాకుండా హై బిపీని తగ్గించడంలో కూడ బీట్ రూట్ జ్యూస్ ఎంతగానో సహకరిస్తుంది. లివర్ కు సంబంధించిన వ్యాధులు రాకుండా సహకరించడమే కాకుండా చర్మం, గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి మరియు ఎముకలు దృఢంగా ఉండటానికి ఈ బీట్ రూట్ జ్యూస్ ఎంతగానో సహకరిస్తుంది. దీనితో వీలైనంత వరకు కూరగా కాకుండా జ్యూస్ గా బీట్ రూట్ తీసుకోవడం మంచిది అని వైద్యులు కూడ చెపుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: